Share News

COVID 19 Nellore Update: నెల్లూరు జిల్లాలో వృద్ధురాలికి కరోనా

ABN , Publish Date - Jun 09 , 2025 | 03:42 AM

నెల్లూరు నగరంలోని వసంతోపులో మరో కరోనా కేసు నమోదైంది. ఆ ప్రాంతానికి చెందిన ఓ వృద్ధురాలి(61)కి ఆదివారం కరోనా నిర్ధారణ అయింది. నగరంలోని కిమ్స్‌ ఆస్పత్రిలో ఆమెకు కరోనా పరీక్ష చేశారు.

COVID 19 Nellore Update: నెల్లూరు జిల్లాలో వృద్ధురాలికి కరోనా

నెల్లూరు(వైద్యం), జూన్‌ 8(ఆంధ్రజ్యోతి): నెల్లూరు నగరంలోని వసంతోపులో మరో కరోనా కేసు నమోదైంది. ఆ ప్రాంతానికి చెందిన ఓ వృద్ధురాలి(61)కి ఆదివారం కరోనా నిర్ధారణ అయింది. నగరంలోని కిమ్స్‌ ఆస్పత్రిలో ఆమెకు కరోనా పరీక్ష చేశారు. కరోనా లక్షణాలు చాలా తక్కువగా ఉండటంతో ఆమెను హోం ఐసొలేషన్‌లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. దీంతో జిల్లాలో కరోనా కేసుల సంఖ్య 8కి చేరింది. ఈ నెల 5న జిల్లాలో 6 కరోనా కేసులు నమోదయ్యాయి. 6న మరో కేసు, తాజాగా 8న ఇంకో కేసు నమోదయ్యాయి. జిల్లాలో కరోనా కేసులు పెరుగుతుండటంతో అప్రమత్తంగా ఉండాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

Updated Date - Jun 09 , 2025 | 03:44 AM