MP Sana Satish: ఏపీ లిక్కర్ స్కాం 20 వేల కోట్లు.. టీడీపీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు..
ABN , Publish Date - Feb 11 , 2025 | 07:17 PM
ఢిల్లీ లిక్కర్ స్కాం 2 వేల కోట్లు అయితే ఏపీ లిక్కర్ స్కాం 20 వేల కోట్లు అని టీడీపీ ఎంపీ సానా సతీష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మిథున్ రెడ్డి అక్రమాలపై పార్లమెంట్‌లో ప్రస్తావించినట్లు తెలిపారు.

ఢిల్లీ: పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మిథున్ రెడ్డి అక్రమాలపై పార్లమెంట్‌లో ప్రస్తావించినట్లు టీడీపీ ఎంపీ సానా సతీష్ తెలిపారు. వారు చేసిన అటవీ భూముల అక్రమాలు, అక్రమ మైనింగ్, లిక్కర్ స్కాంకు సంబంధించిన అంశాలను పార్లమెంట్‌లో చెప్పానన్నారు. ఢిల్లీ లిక్కర్ స్కాం 2 వేల కోట్లు అయితే ఏపీ లిక్కర్ స్కాం 20 వేల కోట్లు అని సంచలన వ్యాఖ్యలు చేశారు. దీనిపై సీబీఐ విచారణ జరిపించాలని కోరినట్లు తెలిపారు. విచారణలో అన్ని తేలుతాయని అన్నారు.
స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు
స్టీల్ ప్లాంట్ అంశంపై ఏనాడు వైసీపీ నేతలు మాట్లాడలేదని, 7 నెలల్లో రాష్టానికి ఎన్నో నిధులు తీసుకొచ్చామని, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగడం లేదని స్టీల్ కేంద్ర మంత్రి స్పష్టం చేశారన్నారు. ఈ క్రమంలోనే పోలవరంపై వైసీపీకి ఎంత చిత్తశుద్ధి ఉందో ప్రజలకు తెలుసని ఎద్దేవా చేశారు. తమ ప్రభుత్వం పోలవరం మొదటి ఫేస్‌లో 41 మీటర్లు నిర్మాణం చేస్తున్నట్లు పేర్కొన్నారు.
శిక్ష అనుభవించాల్సిందే
వైసీపీ నేతలు కేసులు నుంచి తప్పించుకోవడం కోసం ఇవ్వన్నీ మాట్లాడుతున్నారని, వైసీపీ ఎంపీలు తమ వెంట నడవాల్సిన అవసరం లేదని సూచించారు. మిథున్ రెడ్డి, ఇతరులు నేరం రుజవైతే శిక్ష అనుభవించాల్సిందేనని, రాజకీయ కక్ష సాధింపుకు దిగితే ఇప్పటికే అరెస్టు అయ్యేవారని చెప్పుకొచ్చారు.
Also Read: ఇకపై సహించను.. ఆ మంత్రులకు సీఎం స్ట్రాంగ్ వార్నింగ్..