Share News

ఎక్సైజ్‌లో రూ.3,113 కోట్లు దోచుకున్నారు: మంత్రి కొల్లు

ABN , Publish Date - Mar 05 , 2025 | 06:27 AM

వైసీపీ ప్రభుత్వంలో మద్యంఅమ్మకాల్లో అక్రమాలకు పాల్పడి రూ.3,113 కోట్లు దోచుకున్నారని ఎక్సైజ్‌ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అసెంబ్లీలో చెప్పారు.

ఎక్సైజ్‌లో రూ.3,113 కోట్లు దోచుకున్నారు: మంత్రి కొల్లు

అమరావతి, మార్చి 4(ఆంధ్రజ్యోతి): వైసీపీ ప్రభుత్వంలో మద్యంఅమ్మకాల్లో అక్రమాలకు పాల్పడి రూ.3,113 కోట్లు దోచుకున్నారని ఎక్సైజ్‌ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అసెంబ్లీలో చెప్పారు. ఐఎఫ్ఎంల ద్వారా రూ.2,861 కోట్లు, బీర్లు మీద 250 కోట్లు దోచుకున్నట్టు ప్రాఽథమిక సమాచారం ఉందన్నారు. అసెంబ్లీలో మంగళవారం సభ్యుల ప్రశ్నలకు ఆయన సమాధానం ఇచ్చారు. 2019-24 మధ్య కాలంలో మద్యం తయారీ ఆర్డర్లను తమకు నచ్చిన కంపెనీలకు ఇచ్చారని తెలిపారు. ‘కొత్త బ్రాండ్స్‌ తీసుకొచ్చి కేవలం ఏడు కంపెనీలకే సరఫరా చేశారు. దాదాపు 63 శాతం పైగా అర్డర్లు కొన్ని కంపెనీలకే కట్టబెట్టారు. కేసుకు ఇంతని వసూలు చేసినట్టు ఆరోపణలు ఉన్నాయి. మద్యం అక్రమాలన్నింటిపై సీబీసీఐడీ విచారణ జరుగుతోంది. సిట్‌ను ఏర్పాటు చేసినరోజే తాడేపల్లి ప్యాలెస్‌లో ఫైల్స్‌ దగ్ధం అయ్యాయి. ఈ ప్రభుత్వం ఎవరినీ వదిలిపెట్టదు’ అని మంత్రి హెచ్చరించారు. ఎక్సైజ్‌లో జరిగిన అవినీతిని వెలికితీయాలని ఎమ్మెల్యే వంశీకృష్ణ యాదవ్‌ కోరారు.

Updated Date - Mar 05 , 2025 | 06:27 AM