Extortion Case : స్నేహం ముసుగులో మోసం
ABN , Publish Date - Feb 04 , 2025 | 04:30 AM
తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు పట్టణానికి చెందిన యువతి హైదరాబాద్‌లో స్టాఫ్‌వేర్ ఉద్యోగం చేస్తోంది. హాస్టల్‌లో ఆమెకు గుంటూరుకు...

న్యూడ్ ఫొటోల పేరిట బెదిరించి రూ.2.54 కోట్లు వసూలు
నిందితుడి అరెస్టు.. ఆస్తులు సీజ్
నిడదవోలు, ఫిబ్రవరి 3 (ఆంధ్రజ్యోతి): ఇంటర్నెట్‌లో న్యూడ్ ఫొటోలు పెడతామని బెదిరించి.. ఒక యువతి నుంచి రూ.కోట్లలో డబ్బులు వసూలు చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. అతని ఆస్తులను కూడా సీజ్ చేశారు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు పట్టణానికి చెందిన యువతి హైదరాబాద్‌లో స్టాఫ్‌వేర్ ఉద్యోగం చేస్తోంది. హాస్టల్‌లో ఆమెకు గుంటూరుకు చెందిన కాజా అనూషాదేవి పరిచయమైంది. అనూషాదేవి, ఆమె భర్త సాయికుమార్ బాధిత యువతిని డబ్బులు డిమాండ్ చేయసాగారు. డబ్బులివ్వకపోతే మార్ఫింగ్ చేసిన న్యూడ్ ఫొటోలు ఇంటర్నెట్‌లో పెడుతామని బెదిరించారు. దీంతో బాధితురాలు తనతో పాటు బంధువుల ఖాతాల నుంచి పలు దఫాలుగా రూ.2,53,76,000 నగదును వారికి పంపించింది. దీనిపై ఆమె మూడు రోజులు కిందట నిడదవోలు పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీఐ తిలక్ నిందితుడు సాయికుమార్‌ను సోమవారం గుంటూరులో అరెస్టు చేశారు. కోర్టులో హాజరుపర్చగా రిమాండ్ విధించారు. అతని నుంచి రూ.1,81,45,000 విలువ గల నగదు, స్థిర, చరాస్తులను సీజ్ చేశారు. ఆ తర్వాత రాజమహేంద్రవరం సెంటల్ర్ జైలుకు తరలించారు.