Nandyal District: వారం రోజులు సామాజిక సేవ చేయండి!
ABN , Publish Date - Feb 24 , 2025 | 04:31 AM
నంద్యాల జిల్లా బనగానపల్లెలో నిర్వహించిన లోక్ అదాలత్‌లో న్యాయాధికారి ఓ కేసు నిందితులకు విన్నూత శిక్ష విధించారు.

నిందితులకు లోక్ అదాలత్ వినూత్న శిక్ష
కొలిమిగుండ్ల, ఫిబ్రవరి 23 (ఆంధ్రజ్యోతి): నంద్యాల జిల్లా బనగానపల్లెలో నిర్వహించిన లోక్ అదాలత్‌లో న్యాయాధికారి ఓ కేసు నిందితులకు విన్నూత శిక్ష విధించారు. వారం రోజుల పాటు సామాజిక సేవ చేయాలని ఆదేశించారు. వివరాల ప్రకారం.. కొలిమిగుండ్ల మండలానికి చెందిన ఇరువర్గాల యువకులు ఐదుగురు ఈనెల 22న స్థానిక పోలీసుస్టేషన్ సమీపంలో ఘర్షణ పడ్డారు. దీంతో పోలీసులు వారిపై అదే రోజు కేసు నమోదు చేసి, బనగానపల్లె లోక్ అదాలత్‌లో హాజరుపరిచారు. పోలీసుల పర్యవేక్షణలో వారం రోజుల పాటు సామాజిక సేవ చేయాలని నిందితులను ఆదేశిస్తూ న్యాయాధికారి తీర్పు ఇచ్చారు. దీంతో ఆదివారం ఆ యువకులు సామాజిక సేవలో పాల్గొన్నారు. కొలిమిగుండ్ల పోలీసుస్టేషన్‌కు ఎదురుగా ప్లకార్డులపై ప్రదర్శిస్తూ ట్రాఫిక్ నిబంధనలు, రోడ్డు ప్రమాదాల నివారణపై వాహనదారులకు అవగాహన కల్పించారు.