Share News

Kurnool: స్నేహితులతో ఆడుతూ.. పాడుతూ.. యువకుడు..

ABN , Publish Date - Feb 09 , 2025 | 10:08 AM

కోసిగిలోని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో నివసిస్తున్న వీరేష్ అనే యువకుడు కర్నూలు జిల్లా, ఆదోని మండలం, కుప్పగల్లులో తన బంధువుల పెళ్లికి కుటుంబసభ్యులతో వెళ్లాడు. రాత్రి పెళ్లి ఊరేగింపు సమయంలో వీరేష్ డీజే పాటలకు స్నేహితులతో కలిసి డ్యాన్స్ చేసాడు. ఈ క్రమంలో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. దీంతో అందరూ ఆందోళన చెందారు. వీరేష్ మాట్లాడలేకపోవడంతో వెంటనే ఆదోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండగా

Kurnool:  స్నేహితులతో ఆడుతూ.. పాడుతూ..  యువకుడు..
Youth Collapses During Dance..

కర్నూలు జిల్లా: అప్పటి వరకు స్నేహితుల (Friends)తో ఆడుతూ.. పాడుతూ.. ఉత్సాహంగా గడిపిన యువకుడు (Youth) ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. ఏం జరిగిందో అర్ధమయ్యేలోపే ప్రాణాలు విడిచాడు. ఈ ఘటన కర్నూలు జిల్లా, ఆదోని మండలం, కుప్పగల్లులో జరిగింది. వీరేష్ (Veeresh) అనే యువకుడు బంధువుల పెళ్లి (Wedding) వేడుకలో డ్యాన్స్ (Dance) చేస్తూ కిందపడిపోయాడు. వెంటనే ఆస్పత్రికి తీసుకువెళ్లారు. డ్యాన్స్ చేస్తున్నప్పుడు గుండెపోటు రావడంతోనే చనిపోయినట్లు డాక్టర్లు నిర్ధారించారు.

ఈ వార్త కూడా చదవండి..

దస్తగిరి ఫిర్యాదు కేసుపై విమర్శలకు తలెత్తిన విచారణ


కోసిగిలోని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో నివసిస్తున్న వీరేష్ అనే యువకుడు కర్నూలు జిల్లా, ఆదోని మండలం, కుప్పగల్లులో తన బంధువుల పెళ్లికి కుటుంబసభ్యులతో వెళ్లాడు. రాత్రి పెళ్లి ఊరేగింపు సమయంలో వీరేష్ డీజే పాటలకు స్నేహితులతో కలిసి డ్యాన్స్ చేసాడు. ఈ క్రమంలో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. దీంతో అందరూ ఆందోళన చెందారు. వీరేష్ మాట్లాడలేకపోవడంతో వెంటనే ఆదోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గ మద్యలోనే యువకుడు మృతి చెందాడు. దీంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. వీరేష్‌ను డాక్టర్లు పరీక్షించి గుండె పోటుతో మరణించినట్లు నిర్దారించారు. అందరితో కలిసి హుషారుగా ఉండే వ్యక్తి ఇలా అకాలమరణం చెందడంతో వీరేష్ కుటుంబంలో విషాదం నెలకొంది.


వీరేష్‌కు ఇంత వరకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవు. ఇప్పుడు ఒక్కసారిగా గుండెపోటు వచ్చి మృతి చెందడంతో కుటుంబ సభ్యులు జీర్ణించుకోలేకపోతున్నారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. చిన్న పిల్లలను చూసి కోసిగిలో స్థానికులు కన్నీరుమున్నీరవుతున్నారు. మరోవైపు ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

జగన్‌కు సీఎం చంద్రబాబు కౌంటర్

శ్రవారిని దర్శించుకున్న శ్రద్ధా శ్రీనాథ్

డీటీసీకి 14 రోజుల రిమాండ్‌

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Feb 09 , 2025 | 10:08 AM