Share News

ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం

ABN , Publish Date - Nov 02 , 2025 | 12:54 AM

ప్రజల సంక్షేమం, ఆరోగ్యం, అభివృద్ది ధ్యేయంగా ప్రభుత్వం పని చేస్తోందని టీడీపీ మంత్రాలయం నియోజకవర్గ ఇన్‌చార్జి రాఘవేంద్ర రెడ్డి అన్నారు.

ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం
సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులు అందుకున్న వారితో రాఘవేంద్రరెడ్డి

మంత్రాలయం, నవంబరు 1 (ఆంధ్రజ్యోతి): ప్రజల సంక్షేమం, ఆరోగ్యం, అభివృద్ది ధ్యేయంగా ప్రభుత్వం పని చేస్తోందని టీడీపీ మంత్రాలయం నియోజకవర్గ ఇన్‌చార్జి రాఘవేంద్ర రెడ్డి అన్నారు. మండలంలోని మాధవరం తన నివాసంలో బాధిత కుటుంబాలకు రాఘవేంద్ర రెడ్డి సీఎం రిలీఫ్‌ ఫండ్‌ చెక్కులను అందజేశారు. మంచాల సింగిల్‌ విండో అధ్యక్షులు రామకృష్ణారెడ్డి, మాజీ సర్పంచ్‌ రఘునాథరెడ్డి, రాకేష్‌ రెడ్డి, టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి చావడి వెంకటేశ్‌, మాజీ జడ్పీటీసీ లక్ష్మయ్య, మంత్రాలయం మండల టీడీపీ అధ్యక్షుడు ఎస్‌ఎం గోపాల్‌ రెడ్డి, పల్లెపాడు ముత్తురెడ్డి, రామిరెడ్డి, అయ్యన్న, సురేష్‌ నాయుడు, ఏసేబు, ఆధ్వర్యంలో 42 మందికి రూ.16,95,983 సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులను పంపిణీ చేశారు. ఆయన మాట్లాడుతూ కోసిగి మండలానికి 17 మందికి రూ.7,02,091 చెక్కును, కౌతాళంలో ముగ్గురుకి రూ.74,400, మంత్రాలయం మండలంలో 13 మందికి రూ.5,25,397, పెద్దకడుబూరులో 9మందికి రూ.3,94,095 చెక్కులను అందజేశారు. టీడీపీ నాయకులు రాఘవేంద్ర, లక్ష్మన్న, సతీష్‌ నాయుడు, జ్ఞానేష్‌, ఈరన్న, భీమిరెడ్డి, నాగరాజు, కేశన్న, శ్రీనివాసులు పాల్గొన్నారు.

Updated Date - Nov 02 , 2025 | 12:54 AM