TG Venkatesh.. ఆ పోరాటం మొదలు పెట్టింది నేనే: టీజీ వెంకటేష్
ABN , Publish Date - Jan 17 , 2025 | 11:55 AM
ఏపీలో కేంద్రం నిధులు ఇచ్చే ప్రాజెక్టులే వేగంగా ముందుకు వెళ్తున్నాయని, తెలుగు రాష్ట్రల ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి, చంద్రబాబు ముఖ్యమైన ప్రాజెక్టులపై దృష్టి సారించాలని టీజీ వెంకటేష్ సూచించారు. ఏపీ పారిశ్రామిక వేత్తలు తెలంగాణలో ట్యాక్సులు కడుతున్నారని, అందులో మనకు రావాల్సిన షేర్లు రావడం లేదన్నారు.

కర్నూలు జిల్లా: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) సమైక్య రాష్ట్రం (United State)గా ఉండాలని పోరాటం (Fight) మొదలు పెట్టింది తానేనని, రాయలసీమ (Rayalaseema) ప్రాంతం వెనకబడిందని ఆధారాలతో సహా పొలిటికల్ పార్టీలకు ఇచ్చామని.. అప్పుడు ప్రణబ్ ముఖర్జీ (Pranab Mukherjee) మాకు పూర్తి మద్దతు తెలిపారని మాజీ రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్ (TG Venkatesh) అన్నారు. ఈ సందర్భంగా శుక్రవారం ఆయన కర్నూలు (Kurnool)లో మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ విభజనకు అప్పటి సిఎంగా ఉన్న రోశయ్య మద్దతు తెలపలేదని చెప్పారు. ట్యాంకు బండ్‌పై విగ్రహాలు పగలకొడుతున్నప్పుడు శ్రీ కృష్ణ దేవరాయ విగ్రహం పగలగొట్టే ముందు మాపై దాడి చేయండని కోరానని.. వెంటనే ఆందోళన కారులు మమ్మల్ని గౌరవించి వెనక్కి వెళ్ళారన్నారు. రాష్ట్ర విభజన హామీల అమలు చేసే దిశగా తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి చర్యలు మొదలు పెట్టాలని, విభజన హామీల అమలుకు తెలంగాణ పొలిటికల్ పార్టీలు కూడా సహకరించాలని టీజీ వెంకటేష్ విజ్ఞప్తి చేశారు.
ఈ వార్త కూడా చదవండి..
హై అలర్ట్‌గా తెలంగాణ ఛత్తీస్‌గడ్ సరిహద్దు..
ఏపీలో కేంద్రం నిధులు ఇచ్చే ప్రాజెక్టులే వేగంగా ముందుకు వెళ్తున్నాయని, తెలుగు రాష్ట్రల ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి, చంద్రబాబు ముఖ్యమైన ప్రాజెక్టులపై దృష్టి సారించాలని టీజీ వెంకటేష్ సూచించారు. ఏపీ పారిశ్రామిక వేత్తలు తెలంగాణలో ట్యాక్సులు కడుతున్నారని, అందులో మనకు రావాల్సిన షేర్లు రావడం లేదన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దీనిపై చొరవ తీసుకోవాలన్నారు. సిద్దేశ్వరం వద్ద కృష్ణానదిపై ఐకానిక్ బ్రిడ్జితో ప్రాజెక్టు చేపట్టాలని కేంద్ర మంత్రి గడ్కారిని కోరానని, అందుకు గడ్కారి అంగీకారం తెలిపారన్నారు. కానీ గత ప్రభుత్వం అందుకు ప్రతిపాదనలు పంపక పోవడం వల్ల ఆ ప్రాజెక్టు వెనక్కి వెళ్లిందన్నారు.
రాయలసీమ డిక్లరేషన్‌ను అమలు చేసి తీరుతాం...
రాయలసీమ డిక్లరేషన్‌ను అమలు చేసి తీరుతామని, గత ప్రభుత్వం అనుమతి లేకుండా పోతిరెడ్డి పాడు వద్ద రాయలసీమ ఎత్తి పోతల పథకం చేపట్టిందని, దీంతో ఆ ప్రాజెక్టు మధ్యలోనే ఆగిందని, భారీగా ప్రజాధనం వృథా అయిందని టీజీ వెంకటేష్ అన్నారు. ప్రాజెక్టు నిర్మాణం చేపట్టిన వారిపై చర్యలు తీసుకోవాలని, రాయలసీమలో పారిశ్రామిక విప్లవం వస్తోందని, తన కుమారుడు పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ సీమలో ప్రాజెక్టుల స్ధాపనకు నిరంతరం కృషి చేస్తున్నారని తెలిపారు. హంద్రీనీవా ప్రాజెక్టు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉందని, ఆయకట్టు మొత్తానికి నీరు అందించేలా కాలువల పనులు చేపట్టాలన్నారు.
బీజేపీ, చిరంజీవి స్నేహ పూర్వకంగా ముందుకు వెళ్తున్నారు..
వైఎస్సార్‌సీపీ, వామపక్ష పార్టీలు ఇంకా నిషాలో ఉన్నాయని, కేంద్రం పెద్దల నిర్ణయం మేరకే రాష్ట్ర నాయకత్వ మార్పు ఉంటుందని టీజీ వెంకటేష్ అన్నారు. బీజేపీ పెద్దలు.. మెగాస్టార్ చిరంజీవి స్నేహ పూర్వకంగా ముందుకు వెళ్తున్నారని, తదుపరి విషయాలు తనకు తెలియవని అన్నారు. సీఎం చంద్రబాబు అనుభవం వల్ల కూటమి ప్రభుత్వం ఏడు నెలల పాలన అద్భుతంగా ఉందని కొనియాడారు. ఆర్య వైశ్యులపై దాడులను తీవ్రంగా ఖండిస్తున్నా... డోన్ టీడీపీ నాయకుడుపై దాడి చేసిన వారిని రెండు రోజుల్లో అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. లేకుంటే ఆందోళనలు మొదలవు తాయని, గత ప్రభుత్వంలో ఆలయాలపై ధ్వంసం చేసిన వారిని కఠినంగా శిక్షించాలని కోరారు. కర్నూల్‌కు హైకోర్టు బెంచ్ గతంలోనే వచ్చేదని, కానీ కొంతమంది న్యాయవాదులు ఆందోళనలు చేయడం వల్ల ఆగిపోయిందన్నారు. కూటమి ప్రభుత్వం కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తుందని టీజీ వెంకటేష్ అశాభావం వ్యక్తం చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఇద్దరు పిల్లలు ఉంటేనే స్థానిక ఎన్నికల్లో పోటీకి అర్హత
ఈనెల 26వ తేదీ నుంచి రైతు భరోసా..
మత్స్యకారుడు మృతి పట్ల మంత్రి దిగ్భ్రాంతి
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News