Share News

‘ఎమ్మిగనూరును జిల్లాగా ప్రకటించాలి’

ABN , Publish Date - Dec 16 , 2025 | 12:00 AM

కర్నూలు జిల్లాలో కొత్తగా జిల్లా ఏర్పాటు చేస్తే ఎమ్మిగనూరును జిల్లాగా ప్రకటించాలని కుర్ణి కార్పోరేషన్‌ చైర్మన్‌ కామర్తి మిన్నప్ప ప్రభుత్వాన్ని కోరారు.

‘ఎమ్మిగనూరును జిల్లాగా ప్రకటించాలి’
మాట్లాడుతున్న కుర్ణి కార్పొరేషన్‌ చైర్మన్‌ మిన్నప్ప

ఎమ్మిగనూరు, డిసెంబరు 15(ఆంధ్రజ్యోతి): కర్నూలు జిల్లాలో కొత్తగా జిల్లా ఏర్పాటు చేస్తే ఎమ్మిగనూరును జిల్లాగా ప్రకటించాలని కుర్ణి కార్పోరేషన్‌ చైర్మన్‌ కామర్తి మిన్నప్ప ప్రభుత్వాన్ని కోరారు. సోమవారం కుర్ణి కమ్యునిటీ హాల్‌లో టీడీపీ పట్టణ కమిటీ అధ్యక్షుడు మాచాని మహేష్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మిన్నప్ప, నాయకులు దామనరసిహులు, కటారి రాజేంద్ర మాట్లాడారు. ఆదోని జిల్లాకు ఎమ్మెల్యే బీవీ అడ్డుపడున్నట్లు మాజీ ఎంపీ బుట్టా రేణుక ఆరోపించడం విడ్డూరమన్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో కొత్తజిల్లాలు ఏర్పాటు చేసే సమయంలో ఏం చేశారని ప్రశ్నించారు. ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టిందే మీరని మండిపడ్డారు. గత ఎన్నికల్లో ఎమ్మిగనూరు నుంచి పోటీ చేసిన బుట్టా రేణుక నేడు ఆదోని జిల్లా కావాలని కోరటంతో ఈ ప్రాంత ప్రజలకు ఏమి చెప్పదలుచుకున్నారన్నారు. సమావేశంలో నాయకులు అబ్దుల్లా పాల్గొన్నారు.

Updated Date - Dec 16 , 2025 | 12:00 AM