AP NEWS: ఏపీలో మరోసారి బరితెగించిన వైసీపీ మూకలు.. ఏం చేశారంటే..
ABN , Publish Date - Apr 25 , 2025 | 11:11 AM
YSRCP VS TDP: గుడివాడలో మరోసారి వైసీపీ మూకలు అలజడులు సృష్టించారు. టీడీపీ నేతకు చెందిన ఓ కార్యాలయంపై దాడి చేశారు. అడ్డు వచ్చిన వారిని బెదిరించారు. ఈ విషయంపై టీడీపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

గుడివాడ: గుడివాడలో వైసీపీ మూకలు మరోసారి బరితెగించారు. జగన్ ప్రభుత్వంలో విచ్చలవిడిగా వైసీపీ శ్రేణులు రెచ్చిపోయారు. వైసీపీ హయాంలో ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం జగన్మోహన్‌రెడ్డి అండ చూసుకుని దాడులకు తెగబడ్డారు. టీడీపీ నేతలపై విచక్షణ రహితంగా దాడులు చేశారు. దాడులు చేయడమే గాకుండా కేసులు పెట్టి మరీ వేధించారు. ఎంతోమంది నేతలు, కార్యకర్తలు, సామాన్య ప్రజలు వారి ఆగడాలకు తట్టుకోలేక పోయారు. దాడులు చేయడమే గాకుండా వైసీపీ మూకలు ఎంతోమందిని పొట్టన పెట్టుకున్నాయి.
కూటమి ప్రభుత్వంలోనూ వైసీపీ శ్రేణులు దాడులకు పాల్పడుతుండటంతో టీడీపీ నేతలు, ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. జగన్ హయాంలో ఏపీని రణరంగంగా మార్చడంతో చూసి తట్టుకోలేకపోయిన సామాన్య ప్రజలు వైసీపీకి ఓటుతో బుద్ధి చెప్పారు. జగన్ పార్టీని కూకటివేళ్లతో సహా పెకిలించి వేశారు. ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో కేవలం 11 సీట్లకు మాత్రమే పరిమితం చేసి వైసీపీకి సరైన గుణపాఠం చెప్పారు. అయినా కూడా వైసీపీ నేతల్లో ఏ మాత్రం మార్పు రావడం లేదు. సరికదా ఆ పార్టీ హై కమాండ్ దిగువ స్థాయి కేడర్‌ను వారించినా సందర్భాలు కూడా లేకపోవడంతో విచ్చలవిడిగా దాడులకు తెగబడుతున్నారు. తాజాగా గుడివాడలో టీడీపీ నేతకు సంబంధించిన కార్యాలయంపై దాడి చేయడం ఇప్పుడు సంచలనంగా మారింది.
గుడివాడ మార్కెట్ యార్డు వద్ద తెలుగుదేశం నేతకు చెందిన లారీ ట్రాన్స్‌పోర్ట్ కార్యాలయంపై నిన్న (గురువారం) అర్ధరాత్రి మూకుమ్మడిగా వైసీపీ మూకలు దాడి చేశారు. ఈ కార్యాలయంలోని ఫర్నిచర్, సీసీ కెమెరాలు ధ్వంసం చేశారు. వైసీపీ నేత లింగం చిట్టిబాబు, తన అనుచరులు మరో 15 మంది ఈ దాడిలో పాల్గొన్నట్లు ట్రాన్స్‌పోర్ట్ నిర్వాహకులు గుర్తించారు. అర్ధరాత్రి కార్యాలయం పరిసరాల్లో విధ్వంసం సృష్టించారు. కార్యాలయంలో రూ. 3 లక్షల నగదు, విలువైన వస్తువులు ఎత్తుకెళ్లారని ట్రాన్స్‌పోర్ట్ నిర్వాహకుడు అడుసుమిల్లి శ్రీనివాస్ తెలిపారు.
దాడి జరుగుతున్నప్పుడు అడ్డుకోబోయిన స్థానికులను చంపుతామంటూ బెదిరించారని అడుసుమిల్లి శ్రీనివాస్ తెలిపారు. ఆ కారణంగానే కార్యాలయంపై దాడి చేశారని ఆందోళన వ్యక్తం చేశారు. పోలీసులు స్పందించి చర్యలు తీసుకోవాలని అడుసుమిల్లి శ్రీనివాస్ కోరారు. పోలీసులకు ట్రాన్స్‌పోర్ట్ నిర్వాహకుడు అడుసుమిల్లి శ్రీనివాస్ ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు ఆధారంగా పోలీసులు విచారణ చేపట్టారు. దాడి చేసిన వారిని గుర్తించడానికి సీసీ కెమెరాలను పోలీసులు పరిశీలిస్తున్నారు. దాడికి గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ విషయం తెలియడంతో గుడివాడలోని టీడీపీ నేతలు నిరసనకు దిగారు.
ఈ వార్తలు కూడా చదవండి...
Deputy CM Pawan Kalyan: ఇక స్థానిక ప్రభుత్వాలు
Visakhapatnam: రెండున్నర గంటలు పరుగెడుతూనే ఉన్నాం
Controversial Cases: అంతా ‘ఒక్క’టయ్యారు
Kashmir Terror Attack: ఉగ్రవాదుల్ని ఏరిపారేయాలి
For More AP News and Telugu News