Share News

Nimmala Ramanaidu On R&R packages: పోలవరం R&R ప్యాకేజ్‌పై మంత్రి కీలక ప్రకటన

ABN , Publish Date - Nov 01 , 2025 | 01:51 PM

సీఎం చంద్రబాబుగా ఉండగా మూడుసార్లు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ అందజేసినట్లు తెలిపారు. వైసీపీ హయాంలో ఒక్క రూపాయి కూడా ప్యాకేజ్ ఇవ్వలేదని మంత్రి రామానాయుడు మండిపడ్డారు.

Nimmala Ramanaidu On R&R packages:  పోలవరం R&R ప్యాకేజ్‌పై మంత్రి కీలక ప్రకటన
Nimmala Ramanaidu On R&R packages

ఏలూరు, నవంబర్ 1: పోలవరం ప్రాజెక్ట్‌ను ధ్వంసం, విధ్వంసం చేసింది వైసీపీ అని మంత్రి నిమ్మల రామానాయుడు (Minister Nimmala Ramanaidu) విమర్శలు గుప్పించారు. శనివారం వేలేరుపాడులో పోలవరం నిర్వాసితులతో ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడుతూ... పోలవరం నిర్వాసితుల ద్రోహి జగన్ అంటూ వ్యాఖ్యలు చేశారు. నిర్వాసితులకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. పోలవరం ప్రాజెక్టు మొదటి దశకు లక్షా 99 వేల ఎకరాలు అవసరం ఉందని.. ఇప్పటి వరకు 86, 900 ఎకరాలు సేకరించామని తెలిపారు. ప్రాజెక్టు రెండో దశకు 67,600 ఎకరాలు అవసరం ఉండగా.. ఇప్పటి వరకు 29,700 ఎకరాలు సేకరించినట్లు వెల్లడించారు.


సీఎం చంద్రబాబుగా ఉండగా మూడుసార్లు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ అందజేసినట్లు తెలిపారు. వైసీపీ హయాంలో ఒక్క రూపాయి కూడా ప్యాకేజ్ ఇవ్వలేదని మండిపడ్డారు. ‘మీ డబ్బులు మీకు ఇవ్వడానికి కూడా మానవత్వం లేని వ్యక్తి జగన్’ అంటూ మంత్రి దుయ్యబట్టారు. పోలవరం నిర్వాసితుల కోసం కాలనీలు నిర్మించడానికి ఒక్క ఇటుక కూడా ఇవ్వలేదన్నారు. 739 కోట్ల రూపాయలతో 49 కొత్త కాలనీల నిర్మాణానికి టెండర్లు పిలిచామని గుర్తుచేశారు. అయితే కాలనీలు నిర్మించకుండా తాడేపల్లి ప్యాలెస్‌లో జగన్ మొద్దు నిద్రపోయారని ఎద్దేవా చేశారు. 17,200 కుటుంబాలకు కొత్తగా జనవరి నుంచి ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ అమలు చేయబోతున్నామని ప్రకటించారు.


2014-2019లో పోలవరం ప్రాజెక్టు కోసం.. కేంద్రం నిధుల కోసం ఎదురు చూడకుండా రాష్ట్ర నిధులతో పనులు చేశామని అన్నారు. 2019లో కేంద్రం నుంచి వచ్చిన రూ.3వేల385 కోట్ల రీ యింబర్స్‌మెంట్ నిధులను జగన్ పక్కదారి పట్టించారని ఆరోపించారు. 2026 డిసెంబర్ నాటికి ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ అమలును పూర్తి చేస్తామని ప్రకటించారు. ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ నిర్వాసితుల సమస్యల కోసం టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేస్తామన్నారు. పరిహారం పంపిణీలో బ్రోకర్లు లేకుండా అవినీతి జరగకుండా అధికారులు నిఘా పెట్టాలి మంత్రి నిమ్మల రామానాయుడు ఆదేశించారు.


ఇవి కూడా చదవండి...

పదేపదే బాంబు బెదిరింపులు.. ఆందోళనలో ప్రయాణికులు

షాకింగ్ ఘటన... జీహెచ్ఎంసీ పారిశుద్ధ్య కార్మికురాలిపై అత్యాచారం

Read Latest AP News And Telugu News

Updated Date - Nov 01 , 2025 | 02:41 PM