Share News

YS Jagan Tour: నేడు జగన్ పర్యటన.. షరతులతో కూడిన అనుమతి

ABN , Publish Date - Nov 04 , 2025 | 08:55 AM

హైవేపై ఎటువంటి గుమిగూడటం గాని సమావేశాలు నిర్వహించడానికి గాని అనుమతి లేదని డీఎస్పీ సీహెచ్.రాజా తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లో హైవేపై వాహన రాకపోకలు, ప్రజా జీవనానికి ఎటువంటి అంతరాయం కలిగించరాదని పేర్కొన్నారు.

YS Jagan Tour: నేడు జగన్ పర్యటన.. షరతులతో కూడిన అనుమతి
YS-Jagan

కృష్ణా: నేడు జిల్లాలో వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి పర్యటించనున్నారు. మొంథా తుఫాన్ బాధిత రైతులను జగన్ పరామర్శిస్తారు. ఈ సందర్భంగా పోలీసులు, జగన్ పర్యటనకు షరతులతో కూడిన అనుమతి మంజూరు చేశారు. గతంలో జరిగిన ఘటనల‌ నేపథ్యంలో నిబంధనలు పాటించాలని వైసీపీ నేతలు, కార్యకర్తలకు పోలీసులు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా డీఎస్పీ సిహెచ్.రాజా మాట్లాడారు..


హైవేపై ఎటువంటి గుమిగూడటం గాని సమావేశాలు నిర్వహించడానికి గాని అనుమతి లేదని డీఎస్పీ సీహెచ్.రాజా తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లో హైవేపై వాహన రాకపోకలు, ప్రజా జీవనానికి ఎటువంటి అంతరాయం కలిగించరాదని పేర్కొన్నారు. అనుమతి సమయం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మాత్రమే అని ఆయన స్పష్టం చేశారు. రామరాజుపాలెం, ఆకుమర్రు, సీతారామపురం, ఎస్.ఎన్ గొల్లపాలెంలో మాత్రమే పర్యటనకు అనుమతి ఇచ్చినట్లు చెప్పారు.


ఆయా గ్రామాలలో 500 మందికి, 10 కాన్వాయ్ వాహనాలకు మాత్రమే అనుమతి మంజూరు చేసినట్లు డీఎస్పీ రాజా పేర్కొన్నారు. ద్విచక్ర వాహనాలకు ఎలాంటి అనుమతి లేదని తెలిపారు. పరిమితికి మించిన ప్రజలను, వాహనాలను వినియోగించినా.. పోలీసు వారి అనుమతిని మీరినా వెంటనే ఆ కార్యక్రమం నుంచి డైవర్ట్ చేయడం జరుగుతుందని అన్నారు. ఈ పర్యటనలో డీజే వినియోగానికి ఎలాంటి అనుమతి లేదని చెప్పారు. ఈ కార్యక్రమం దృష్ట్యా ప్రాణనష్టం, ఆస్తి నష్టం ఏదైనా సంభవిస్తే దానికి కార్యక్రమం నిర్వహకులే పూర్తి బాధ్యులు అని వివరించారు. తొక్కిసలాట జరగకుండా, ప్రజా జీవనానికి అసౌకర్యం ఏర్పడకుండా పోలీస్ వారు తీసుకునే ఆంక్షలను అనుకరిస్తూ పర్యటనను సజావుగా జరిగేలా నేతలు, ప్రజలు సహకరించాలని డీఎస్పీ రాజా కోరారు.


ఇవి కూడా చదవండి:

Electricity Department: అన్ని జిల్లాల్లో 400 కేవీ సబ్‌స్టేషన్లు

AP Assembly House Committee: వైసీపీ హయాంలో అవినీతిపై 17లోగా నివేదిక

Updated Date - Nov 04 , 2025 | 09:48 AM