Share News

Gorantla Slams Jagan: ఇలానే ఉంటే ఇక రోడ్డెక్కవ్.. జగన్‌కు గోరంట్ల వార్నింగ్

ABN , Publish Date - Jun 20 , 2025 | 02:38 PM

Gorantla Slams Jagan: ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగించేలా వ్యవహరిస్తావా అంటూ జగన్‌పై గోరంట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘రౌడీలు, గుండాలు, గంజాయి బ్యాచ్ లను వెనకేసుకొస్తూ తలలునరికితే తప్పేందంటావా? అంటూ మండిపడ్డారు.

Gorantla Slams Jagan: ఇలానే ఉంటే ఇక రోడ్డెక్కవ్.. జగన్‌కు గోరంట్ల వార్నింగ్
Gorantla Slams Jagan

అమరావతి, జూన్ 20: మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై (Former CM YS Jagan Mohan Reddy) ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి (MLA Gorantla Butchaiah Chowdary) ఫైర్ అయ్యారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. ‘ఖబడ్దార్ జగన్ రెడ్డి.. పొట్టెలు తలలు నరికినట్లు ఎవరి తలలు నరుకుతావు? ప్రజల ఇచ్చిన తీర్పుతో మతిభ్రమించి ప్యాలెస్‌లో టీవీలు పగలగొట్టుకుంటూ పిచ్చి పిచ్చిగా మాట్లాడుతావా?’ అంటూ మండిపడ్డారు. ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగించేలా వ్యవహరిస్తావా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘రౌడీలు, గుండాలు, గంజాయి బ్యాచ్ లను వెనకేసుకొస్తూ తలలునరికితే తప్పేందంటావా?.. రాజారెడ్డి రాజ్యంగంతో ప్రజలను వంచించి, హింసించిన నీ తల ఎందుకు నరకకూడదు?’ అని ప్రశ్నించారు.


గత ఐదేళ్లు ఒక నియంతలా పరిపాలించి.. నేడు మళ్ళీ అధికారం కోసం కులాలు, మతాల, ప్రజలు, ప్రాంతాల మధ్య విధ్వేషాలు రెచ్చగొడతున్నారంటూ విమర్శించారు. అసలు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే హక్కు జగన్‌కు ఉందా అని అన్నారు. గత ఐదేళ్లు ఏం చేశావో దమ్ముంటే చర్చకు సిద్ధమా అంటూ జగన్‌కు సవాల్ విసిరారు. జగన్‌ గెలుస్తారని బెట్టింగ్ పెట్టి ఆ డబ్బులు కట్టలేక నాగమల్లేశ్వరరావు ఆత్మహత్య చేసుకుంటే సంవత్సరం తరువాత పరామర్శకు వెళతావా అంటూ నిలదీశారు.


కూటమి ప్రభుత్వం రాక ముందు జరిగిన సంఘటనకు ప్రభుత్వానికి సంబంధం ఏంటన్నారు. జగన్‌ పర్యటనలో ఇద్దరు ఆ పార్టీ వాళ్లే చనిపోతే కనీసం పరామర్శించాడనికి కూడా వెళ్లలేదంటూ ఆగ్రహించారు. ఇకనైనా జగన్ రెడ్డి కపట నాటకాలకను కట్టి పెట్టాలన్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా చంద్రబాబు పాలన సాగిస్తున్నారు కాబట్టే జగన్ బయట తిరుగుతున్నారన్నారు. దీన్ని అలుసుగా తీసుకుంటే జగన్ రెడ్డి రోడ్డెక్కే పరిస్థితి ఉండదని ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి హెచ్చరించారు.


ఇవి కూడా చదవండి

ఏపీకి కాగ్నిజెంట్..

మా ప్రస్తావన అనవసరం.. జగన్‌పై కమ్మ సంఘాల ఆగ్రహం

నేరపూరిత స్వభావం కలిగిన వ్యక్తి జగన్.. ఎమ్మెల్యే ఆగ్రహం

Read Latest AP News And Telugu News

Updated Date - Jun 20 , 2025 | 04:29 PM