Share News

Davos: అట్టహాసంగా ప్రారంభమైన వరల్డ్ ఎకనికమిక్ ఫోరం సదస్సు

ABN , Publish Date - Jan 21 , 2025 | 10:03 AM

దావోస్‌లో ఉక్కు దిగ్గజం లక్ష్మీమిట్టల్‌తో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, రాష్ట్ర ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి లోకేష్ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్ భావనపాడులో పెట్రో కెమికల్ హబ్ ఏర్పాటుకు పెట్టుబడులు పెట్టాలని కోరారు. ఏపీలో సోలార్ సెల్ తయారు ప్లాంటు ఏర్పాటును పరిశీలించాలని లక్ష్మీ మిట్టల్‌ను కోరారు.

Davos: అట్టహాసంగా ప్రారంభమైన వరల్డ్ ఎకనికమిక్ ఫోరం సదస్సు

స్విట్జర్లాండ్‌: దావోస్‌ (Davos)లో వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం (డబ్ల్యూఇఎఫ్‌) వార్షిక సదస్సు (World Economic Forum Conference) 2025 అట్టహాసంగా ప్రారంభమైంది (Begin). ఐదు రోజుల పాటు జరగనున్న ఈ సదస్సుకు వివిధ దేశాల నాయకులు, అధికారులు, వ్యాపార వేత్తలు హాజరుకానున్నారు. జ్యురిచ్ కాలమానం ప్రకారం సోమవారం రాత్రి 8గంటల ప్రాంతంలో దావోస్ కాంగ్రెస్ సెంటర్‌లో వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సు ప్రారంభమైంది.ఈ కార్యక్రమానికి కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు, ఏపీ రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ హాజరయ్యారు. వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సుకు ప్రపంచవ్యాప్తంగా హాజరైన పారిశ్రామికవేత్తలతో పెట్టుబడుల అవకాశాలు, పొటెన్షియల్ కొలాబరేషన్స్‌పై చర్చ జరిగింది. దావోస్ కాంగ్రెస్ సెంటర్ ప్లీనరీ హాలు లాబీలో ఏర్పాటుచేసిన నెట్ వర్కింగ్ డిన్నర్‌కు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, మంత్రి నారా లోకేష్, కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర పరిశ్రమల మంత్రి టిజి భరత్ హాజరయ్యారు. రాష్ట్రంలో పెట్టుబడులకు గల అనుకూలతలను పారిశ్రామిక వేత్తలకు చంద్రబాబు వివరించారు.

ఈ వార్త కూడా చదవండి..

ఆ ఆటో డ్రైవర్‪కు రివార్డు..


లక్ష్మీ మిట్టల్‌తో చంద్రబాబు, లోకేష్ భేటీ..

ఉక్కు దిగ్గజం లక్ష్మీమిట్టల్‌తో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, రాష్ట్ర ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి లోకేష్ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్ భావనపాడులో పెట్రో కెమికల్ హబ్ ఏర్పాటుకు పెట్టుబడులు పెట్టాలని కోరారు. ఏపీలో సోలార్ సెల్ తయారు ప్లాంటు ఏర్పాటును పరిశీలించాలని లక్ష్మీ మిట్టల్‌ను కోరారు. కాగా ఈ సదస్సుకు తొలిసారిగా భారత్‌ భారీ బృందాన్ని పంపింది. భారత్‌ బృందంలో ఐదుగురు కేంద్ర మంత్రులు, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, మహారాష్ట్రల ముఖ్యమంత్రులు, వివిధ రాష్ట్రాలకు చెందిన అనేకమంది మంత్రులతోపాటు దాదాపు వంద మంది సీఈవోలు, ఇతర అధికారులు ఉన్నారు.


కాగా స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక ఫోరం సదస్సులో పాల్గొనేందుకు వెళ్లిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సోమవారం జ్యూరిక్‌ విమానాశ్రయంలో ఏపీ సీఎం చంద్రబాబునాయుడును కలుసుకున్నారు. ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు, ఉన్నతాధికారులతో కలిసి గత నాలుగు రోజులుగా సింగపూర్‌లో పర్యటించిన సీఎం రేవంత్‌.. అక్కడి నుంచి దావోస్‌ సమావేశాల కోసం బయలుదేరి సోమవారం జ్యూరిక్‌ విమానాశ్రయానికి చేరుకున్నారు. మరోవైపు ఇవే సమావేశాల్లో పాల్గొనేందుకు వెళ్లిన ఏపీ సీఎం చంద్రబాబు కూడా అదే సమయంలో జ్యూరిక్‌ విమానాశ్రయానికి చేరుకోవడంతో.. ఇద్దరు సీఎంలు అక్కడే కొద్దిసేపు భేటీ అయ్యారు.

వీరితోపాటు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్‌నాయుడు, తెలంగాణ మంత్రి శ్రీధర్‌బాబు, ఏపీ మంత్రి నారా లోకేశ్‌ కూడా ఈ భేటీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రెండు రాష్ట్రాల్లో జరుగుతున్న అభివృద్ధి, పెట్టుబడులకు సంబంధించిన అంశాలపై ఇరువురు సీఎంల మధ్య చర్చ జరిగిందని తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయం సోమవారం రాత్రి ‘ఎక్స్‌’లో పేర్కొంది. కాగా, ఈ నెల 24 వరకు జరగనున్న ఈ సమావేశాల్లో వివిధ దేశాల నుంచి పెద్దసంఖ్యలో ప్రభుత్వ అధినేతలు, పారిశ్రామిక దిగ్గజాలు పాల్గొంటున్నారు. తొలిరోజు గ్రాండ్‌ ఇండియా పెవిలియన్‌ ఘనంగా ప్రారంభమైంది. సీఎం రేవంత్‌తోపాటు కేంద్ర మంత్రి జయంత్‌ చౌదరి, రాష్ట్ర మంత్రి శ్రీధర్‌బాబు, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు, అధికారులు పాల్గొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

కాశ్మీర్: ఉగ్రవాదుల కాల్పుల్లో ఆంధ్రా జవాన్ మృతి

ప్రముఖ ప్రొడ్యూసర్స్ నివాసాల్లో ఐటీ సోదాలు..

సీ పోర్టు.. వాటాలు కేవీరావుకు తిరిగిచ్చేసిన అరబిందో..

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Jan 21 , 2025 | 10:03 AM