Share News

Vijayawada Maoists: విజయవాడలో మావోల కదలికలు.. పోలీసుల అలర్ట్

ABN , Publish Date - Nov 18 , 2025 | 12:50 PM

విజయవాడలో మావోయిస్టుల కలకలం రేగింది. 27 మంది మావోయిస్టులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.

Vijayawada Maoists: విజయవాడలో మావోల కదలికలు.. పోలీసుల అలర్ట్
Vijayawada Maoists

విజయవాడ, నవంబర్ 18: మావోయిస్టు అగ్రనేత మద్వి హిడ్మా ఎన్‌కౌంటర్‌ వేళ విజయవాడలో మావోయిస్టుల కలకలం రేగింది. కానూరు కొత్త ఆటోనగర్‌లో గ్రేహౌండ్స్, ఆక్టోపస్ బృందాలు, జిల్లా పోలీసుల తనిఖీలు కొనసాగుతున్నాయి. ఛత్తీస్‌గఢ్ నుంచి వచ్చి ఆటోనగర్‌లో ఒక భవనాన్ని మావోయిస్టులు షెల్టర్ జోన్‌గా మార్చుకున్నట్లు సమాచారంతో సోదాలు నిర్వహించారు. మొత్తం 27 మంది మావోయిస్టులు ఇక్కడ ఉన్నట్లు సమాచారం అందింది. భారీగా ఆయుధాలను కూడా డంప్ చేసినట్లు గుర్తించారు. మొత్తం 27 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.


కృష్ణా జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు ఆధ్వర్యంలో అక్టోపస్, గ్రే హౌండ్స్ బలగాలు.. మావోయిస్టులను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. వీరిలో 21 మంది మహిళలు, ఆరుగురు పురుషులు ఉన్నట్టు సమాచారం. మారేడుమిల్లి ఎన్‌కౌంటర్‌లో దొరికిన డెయిరీలో వీరి సమాచారం లభించింది. దాని ఆధారంగానే పోలీసులు సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. వీరందరికీ ఓ మహిళ షెల్టర్ ఇస్తున్నట్లు తెలిసింది. వీరందరినీ అదుపులోకి తీసుకుని రహస్య ప్రదేశానికి తరలించినట్టు సమాచారం. కాగా.. ఆపరేషన్ కగార్ పేరుతో కేంద్ర ప్రభుత్వం కూంబింగ్ చేస్తున్న నేపథ్యంలో మావోయిస్టులు అడవులను వదిలి నగరంలోకి ప్రవేశించినట్లు తెలుస్తోంది.


ఇక.. ఈరోజు (మంగళవారం) ఉదయం అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి అడవుల్లో భద్రతా బలగాలు, మావోయిస్టులకు మధ్య భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు పార్టీ అగ్రనేత హిడ్మా మృతి చెందాడు. హిడ్మాతో పాటు మొత్తం ఆరుగురు ఈ ఎన్‌కౌంటర్‌లో చనిపోయారు. ఈ విషయాన్ని ఏపీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా స్పష్టం చేశారు.


ఇవి కూడా చదవండి...

కుల, మత రాజకీయాలు శాశ్వతంగా నడవవు

కుట్ర చేసే బయటకు పంపారు.. కవిత సంచలన వ్యాఖ్యలు

Read Latest AP News And Telugu News

Updated Date - Nov 18 , 2025 | 03:54 PM