Driver Trapped In Tipper: హైవేపై రోడ్డు ప్రమాదం.. టిప్పర్ క్యాబిన్‌లో చిక్కుకుని డ్రైవర్ నరకయాతన..
ABN , Publish Date - Nov 18 , 2025 | 12:41 PM
రాంబిల్లి జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రోడ్డు పక్కన పార్కింగ్ చేసి ఉన్న టిప్పర్‌ను మరో టిప్పర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ సాయి కుమార్ టిప్పర్ క్యాబిన్‌లో చిక్కుకుపోయాడు.
దేశంలో రోడ్డు ప్రమాదాల సంఖ్య రోజు రోజుకు పెరుగుతూ పోతోంది. నిత్యం పదుల సంఖ్యలో జనం ప్రాణాలు కోల్పోతున్నారు. మరికొంతమంది తీవ్రంగా గాయపడుతున్నారు. సోమవారం ఉదయం విశాఖ రాంబిల్లి జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రోడ్డు పక్కన పార్కింగ్ చేసి ఉన్న టిప్పర్‌ను మరో టిప్పర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ సాయి కుమార్ టిప్పర్ క్యాబిన్‌లో చిక్కుకుపోయాడు. స్థానికులు వెంటనే రంగంలోకి దిగి సాయి కుమార్‌ను పక్కకు తీసుకువచ్చే ప్రయత్నం చేశారు.
వారి ప్రయత్నాలు ఫలించలేదు. పోలీసులు, ఫైర్ సిబ్బందికి సమాచారం అందింది. వారు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. సాయి కుమార్‌ను పక్కకు తీసుకు వచ్చే ప్రయత్నం చేశారు. అతడ్ని బయటకు తీసుకురావటం వారి వల్ల కూడా కాలేదు. సాయి కుమార్ బంధువులు రంగంలోకి దిగారు. కొన్ని గంటల నుంచి అతడ్ని బయటకు తీసుకురావటానికి ప్రయత్నిస్తున్నారు. 6 గంటలుగా సాయి కుమార్ క్యాబిన్‌లో నరకం చూస్తూ ఉన్నాడు. తనను కాపాడాలని అంటూ వేడుకుంటున్నాడు.
ఇవి కూడా చదవండి
రాప్తాడుకు బంగారు భవిష్యత్తు..