Share News

Ambedkar Jayanthi: అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు..

ABN , Publish Date - Apr 27 , 2025 | 01:21 PM

అంబేద్కర్‌ను అవమానపరిచింది.. అలాగే ఆయన ఆశయాలను తుంగలో తొక్కింది కాంగ్రెస్ పార్టీ అని, అంబేద్కర్ చరిత్ర తెలియకుండా కాంగ్రెస్ వ్యక్తులు మాట్లాడుతున్నారని మంత్రి సత్య కుమార్ విమర్శించారు. అంబేద్కర్ పోటీ చేస్తే ఆయన్ని ఓడించేందుకు వేరొక వ్యక్తిని బరిలోకి దించిన పార్టీ కాంగ్రెస్ అని మంత్రి ధ్వజమెత్తారు.

Ambedkar Jayanthi: అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు..
Minister Satya Kumar Yadav

విజయవాడ: నగరంలోని ఎస్ కన్వెన్షన్ హాల్లో అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు (Ambedkar 135th Birth Anniversary) ఆదివారం ఘనంగా జరిగాయి. ఈ ఉత్సవాలలో భాగంగా మేధావుల సదస్సుకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (Union Minister Kishan Reddy), రాష్ట్ర మంత్రి సత్య కుమార్ యాదవ్ (Minister Satya Kumar Yadav) హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి సత్య కుమార్ యాదవ్ మాట్లాడుతూ.. ప్రతి సంవత్సరం అంబేద్కర్ జయంతి జరుపుకుంటామని అన్నారు. రాజ్యాంగాన్ని జాతికి అందించిన అంబేద్కర్ గురించి కాంగ్రెస్ (Congress) నేతలు అసత్య ప్రచారాలు చేస్తున్నారని, అంబేద్కర్‌ని అవమానించిన వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే అది కాంగ్రెస్ అని విమర్శించారు. అంబేద్కర్ ఆశయాలను ప్రజలకు అందిస్తున్నది ప్రధాని మోదీ (PM Modi) అని, ఆయన రాజ్యాంగ స్ఫూర్తికి కట్టుబడి పని చేస్తున్నారని కొనియాడారు. బలహీన వర్గాల వారిని అణగారిని వర్గాల వారికీ సంక్షేమం అందిస్తోంది ప్రధాని మోదీయేనని మంత్రి అన్నారు.

Also Read..: రాష్ట్రపతి భవన్‌లో సోమవారం పద్మ అవార్డుల ప్రదానోత్సవం..


కాంగ్రెస్ అంబేద్కర్‌ను అవమానపరిచింది..

అంబేద్కర్‌ను అవమానపరిచింది.. అలాగే ఆయన ఆశయాలను తుంగలో తొక్కింది కాంగ్రెస్ పార్టీ అని, అంబేద్కర్ చరిత్ర తెలియకుండా కాంగ్రెస్ వ్యక్తులు మాట్లాడుతున్నారని మంత్రి సత్య కుమార్ విమర్శించారు. అంబేద్కర్ పోటీ చేస్తే ఆయన్ని ఓడించేందుకు వేరొక వ్యక్తిని బరిలోకి దించిన పార్టీ కాంగ్రెస్ అని మంత్రి ధ్వజమెత్తారు. చట్ట సభల్లోకి రానివ్వకుండా అడ్డుకున్న పార్టీ కాంగ్రెస్ అని, మేధావుల సభల్లో అంబేద్కర్ ఉండాలని మేధావులు కోరుకుంటే కాంగ్రెస్ మాత్రం ఆయన్ని రానివ్వకుండా ఓడించాలని కోరుకునేదాని ఆరోపించారు. పార్లమెంట్‌లోకి వెళ్లకుండా నెహ్రు సయితం అంబేద్కర్‌ని వ్యతిరేకించారన్నారు. అంబేద్కర్‌కు భారత రత్న ఇవ్వకుండా ఆనాడు కాంగ్రెస్ అడ్డుకుందని, కానీ అంబేద్కర్ చూపిన స్ఫూర్తితో ఆనాడు భారత రత్న ఇవ్వాలని వాజ్‌పై సూచించారన్నారు.


మౌలిక స్వరూపాన్ని మార్చే హక్కు ఎవరికీ లేదు..

పార్లమెంట్‌లో‌ అంబేద్కర్ చిత్ర పటాన్ని పెట్టిన ఘనత బీజేపీదేనని , అంబేద్కర్ నడయాడిన ప్రదేశాలను పంచ తీర్థాలుగా గుర్తింపు తీసుకొచ్చామని మంత్రి సత్య కుమార్ అన్నారు. అంబేద్కర్ అంత్యక్రియలు చేయటానికి ఆరడుగులు భూమిని కాంగ్రెస్ కేటాయించలేకపోయిందని విమర్శించారు. బీజేపీ రాజ్యాంగాన్ని సవరించిందని కాంగ్రెస్ అసత్య ప్రచారాలు చేస్తోందని దుయ్యబట్టారు. మౌలికస్వరూపాన్ని మార్చే హక్కు ఎవరికీ లేదని, ప్రజా పాలన దృష్ట్యా రాజ్యాంగ సవరణలు చేయటానికి ప్రభుత్వానికి ఉంటుందన్నారు. 8 సవరణలు మాత్రమే ప్రధాని మోదీ ఉన్నప్పుడే జరిగాయని... దేశ అభివృద్ధికి, బడుగు, బలహీన వర్గాల వారి కోసమే సవరణలు జరిగాయని చెప్పారు. కాంగ్రెస్ హయాంలో మాత్రం వారి స్వలాభం కోసం, వారి సొంత పెత్తనాల కోసమే సవరణలు చేసారని మంత్రి విమర్శించారు. రిజర్వేషన్‌లు తీసేస్తున్నామని కాంగ్రెస్ అసత్య ప్రచారాలు చేస్తోందని, ఉన్న రిజర్వేషన్‌లకు ఒక 10 శాతం పెంచి బడుగు బలహీన వర్గాల వారిని మరింత బలపడేలా బీజేపీ చేసిందన్నారు.రిజర్వేషన్స్ ఉండటం వల్ల అసమర్థులుగా మారతారని కాంగ్రెస్ అనేక సార్లు చెప్పిందని మంత్రి సత్య కుమార్ తీవ్రస్థాయిలో విమర్శించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

Kaleswaram Case: ఈఎన్‌సీ హరి రామ్‌కు 14 రోజుల రిమాండ్..

హైదరాబాదులో హెచ్ఐసీసీలో భారత్ సమీట్..

ఏఎంసీలో శతాబ్ది భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు

For More AP News and Telugu News

Updated Date - Apr 27 , 2025 | 01:21 PM