Share News

Lanka Dinakar Tirumala Laddu: తిరుమల లడ్డులో నకిలీ నెయ్యి వాడకంపై లంకా దినకర్ సంచలన వ్యాఖ్యలు

ABN , Publish Date - Nov 10 , 2025 | 01:36 PM

తిరుమల లడ్డూ తయారీలో నకిలీ నెయ్యి వాడకంపై లంకా దినకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యవహారానికి సంబంధించి సీబీఐ విచారణలో వాస్తవాలు బయటకు వచ్చాయని అన్నారు.

Lanka Dinakar Tirumala Laddu: తిరుమల లడ్డులో నకిలీ నెయ్యి వాడకంపై లంకా దినకర్ సంచలన వ్యాఖ్యలు
Lanka Dinakar Tirumala Laddu

అమరావతి, నవంబర్ 10: తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డు (Tirumala Laddu) తయారీలో నకిలీ నెయ్యిని వాడటం అనేది క్షమించరాని నేరమని ఇరవై సూత్రాల కార్యక్రమాల అమలు ఛైర్మెన్ లంకా దినకర్ (Lanka Dinakar) అన్నారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. వేంకటేశ్వర స్వామి వారి ఆధ్యాత్మికతకు భంగం కలిగించిన వారికి ఏం శిక్ష పడుతుందో చరిత్ర తెలిపిందన్నారు. 2019 నుంచి 2024 మధ్య తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) ఆధ్యాత్మిక విలువలను చెడగొట్టారని విమర్శించారు.


టీటీడీని ఆధ్యాత్మిక కేంద్రంగా కాకుండా వారి సహచరులకు ఆదాయ వనరులుగా జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం పరిగణించిందని వ్యాఖ్యలు చేశారు. సీబీఐ విచారణలో నిర్ఘంతపోయే విధంగా నకిలీ నెయ్యి సప్లై పైన నిజాలు బయటకు వచ్చాయన్నారు. 2019 - 24 మధ్య బోలే బాబా ఆర్గానిక్ డైరీ వారు 68 లక్షల కేజీల నెయ్యిని తిరుమల తిరుపతి దేవస్థానానికి సప్లై చేశారని.. ఈ సంస్థ పాలు కానీ వెన్న కానీ ఒక్క చుక్క కూడా ఎక్కడి నుంచి కూడా సేకరించలేదని తేలిందన్నారు.


నకిలీ నెయ్యి తయారు చేయటానికి వాడినటువంటి రసాయనాలు సప్లై చేసిన కంపెనీ వివరాలను సీబీఐ రాబట్టిందని చెప్పారు. జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైసీపీ ప్రభుత్వం నియమించిన టీటీడీ బోర్డు అనేక అక్రమాలకు పాల్పడిన ప్రతి సందర్భంలో వాస్తవాన్ని పదేపదే తాము చెబుతూ వచ్చామని.. కానీ నాటి ప్రభుత్వం పట్టించుకోలేదని లంకా దినకర్ విమర్శలు గుప్పించారు.


ఇవి కూడా చదవండి...

రాయలచెరువు గండి ఘటన.. ప్రభుత్వం కీలక నిర్ణయం

మంత్రులకు సీఎం చంద్రబాబు అభినందనలు.. ఎందుకంటే

Read Latest AP News And Telugu News

Updated Date - Nov 10 , 2025 | 01:51 PM