Tiruvuru Panchayat Election: తిరువూరు ఛైర్మన్ ఎన్నిక వాయిదా.. ఎందుకంటే
ABN , Publish Date - May 19 , 2025 | 01:58 PM
Tiruvuru Panchayat Election: తిరువూరు పంచయతీ ఎన్నిక వాయిదా పడింది. కోరం లేకపోవడంతో ఎన్నికను వాయిదా వేస్తున్నట్లు ఎన్నికల అధికారి ప్రకటించారు.

ఎన్టీఆర్ జిల్లా, మే 19: తిరువూరు నగర పంచాయతీ ఛైర్మన్ ఎన్నిక (Tiruvuru Nagara Panchayat Chairman Election) వాయిదా పడింది. కోరం లేకపోవడంతో ఎన్నికను అధికారులు రేపటికి (మంగళవారం) వాయిదా వేశారు. ఎన్నికకు కేవలం ఏడుగురు సభ్యులు మాత్రమే హాజరయ్యారు. నగర పంచాయతీలో మొత్తం కౌన్సిల్ సభ్యులు 20 మంది ఉన్నారు. వారిలో కేవలం ఏడుగురు మాత్రమే ఎన్నికకు వచ్చారు. మిగిలిన వారు ఎవరూ కూడా హాజరుకాకపోవడంతో ఎన్నికను వాయిదా వేయాల్సి వచ్చిందని ఎన్నికల అధికారి చెప్పారు.
కాగా.. తిరువూరు నగర పంచాయతీ ఎన్నిక సందర్భంగా ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. టీడీపీ, వైసీపీకి చెందిన సభ్యులతో పాటు వారి అనుచరులు కూడా ఎన్నిక జరిగే ప్రాంగణానికి రావడంతో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ఇరు పార్టీల నేతలను, అనుచరులను ఎన్నికల ప్రాంగణం నుంచి చెదరగొట్టి ప్రశాంత వాతావరణాన్ని తీసుకొచ్చారు పోలీసులు. ఎన్నిక సందర్భంగా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతను కల్పించారు. ఉదయమే ఎన్నిక ప్రాంగణానికి చేరుకోవడంతో టీడీపీ, వైసీపీ నేతల మధ్య తోపులాట చోటు చేసుకుంది. పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లను తొలగించి కౌన్సిల్ హాల్‌లోకి వెళ్లేందుకు వైసీపీ నేతలు తీవ్రంగా ప్రయత్నించారు. కానీ వారిని పోలీసులు అడ్డుకుని అక్కడి నుంచి చెదరగొట్టారు.
Kasireddy Supreme Court: కసిరెడ్డి పిటిషన్‌పై ముగిసిన విచారణ.. సుప్రీం తీర్పు త్వరలో
మొత్తం 20 మందిలో 17 మంది వైసీపీ సభ్యులు, ముగ్గురు టీడీపీ సభ్యులు, ఎక్సఫీషోయో సభ్యులుగా ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు ఉన్నారు. అయితే పలువురు వైసీపీ కౌన్సిలర్లు టీడీపీ వైపు మొగ్గు చూపిస్తున్నట్లు తెలుస్తోంది. వైసీపీ కౌన్సిలర్లు టీడీపీకి మద్దుతు ఇస్తే తిరువూరు నగర పంచాయతీ ఛైర్మన్ పదవి టీడీపీకి దక్కే అవకాశం ఉంది. ఇప్పటికే ముగ్గురు వైసీపీ కౌన్సిలర్లు టీడీపీ పార్టీ కండువా కప్పుకోగా.. మరో ఐదుగురు టీడీపీకి మద్దతుగా నిలిచారు. అయితే ఎలాగైనా ఛైర్మన్ పోస్టును దక్కించుకునేందుకు వైసీపీ విశ్వప్రయత్నాలు చేస్తోంది. ఈరోజు కోరం లేక ఎన్నిక వాయిదా పడగా.. రేపటి ఎన్నికల్లో ఛైర్మన్ పదవిని ఎవరు దక్కించుకోబోతున్నారనే ఉత్కంఠ నెలకొంది.
ఇవి కూడా చదవండి
Hydra Demolitions: హైడ్రా కూల్చివేతలు షూరూ.. టెన్షన్ టెన్షన్
Nandigam Suresh: నందిగం సురేష్‌కు ఎదురు దెబ్బ
Read Latest AP News And Telugu News