Share News

Amaravati Farmers Issues: వారి సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నాం: త్రీ మెన్ కమిటీ

ABN , Publish Date - Nov 29 , 2025 | 12:25 PM

రాజధాని రైతుల సమస్యలపై సీఆర్డీఏ అధికారులతో త్రీ మెన్ కమిటీ సమీక్ష సమావేశం నిర్వహించింది. రాయపూడి సీఆర్డీఏ కార్యాలయంలో రాజధాని రైతు కమిటీ సభ్యులు, సీఆర్డీఏ అధికారులతో కమిటీ సభ్యులు భేటీ అయ్యారు.

Amaravati Farmers Issues: వారి సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నాం: త్రీ మెన్ కమిటీ
Amaravati Farmers Issues

అమరావతి, నవంబర్ 29: సీఎం చంద్రబాబు (CM Chandrababu) సూచనల మేరకు రాజధాని రైతులపై త్రిసభ్య కమిటీ సమావేశం జరిగిందని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ (Union Minister Pemmasani Chandrasekhar) అన్నారు. ఈరోజు (శనివారం) రాయపూడి సీఆర్డీఏ కార్యాలయంలో రాజధాని రైతు కమిటీ సభ్యులు, సీఆర్డీఏ అధికారులతో త్రీ మెన్ కమిటీ సభ్యులు భేటీ అయ్యారు. రాజధాని రైతుల సమస్యలపై చర్చించారు. అనంతరం కేంద్రమంత్రి మీడియాతో మాట్లాడుతూ.. 1286 ప్లాట్లకు వీధి పోటు సమస్యలు ఉన్నాయని.. వాస్తు ప్రకారం కొన్ని ఇబ్బందులు వచ్చాయని తెలిపారు.


156 మంది రైతులకు వాస్తు ఇబ్బందులు ఉన్నాయని తెలిపారు. ఒక వేళ వాస్తు బాలేని రైతులు తమకు వేరే చోట కావాలని చెప్తే కేటాయిస్తారని అన్నారు. రైతులకు పెన్షన్, హెల్త్ కార్డు సమస్యలు ఉన్నాయని.. ఒక నెలలోనే పరిష్కారం అవుతాయని వెల్లడించారు. లంక భూములు, అసైన్డ్ భూముల సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టామన్నారు. అసైన్డ్ ల్యాండ్‌ను మిగిలిన భూములతో సెపరేట్ చేసి క్యాబినెట్‌లో చర్చిస్తామని అన్నారు. ప్రతి రెండు వారాలకు అందరి రైతుల సమస్యలు వింటామని కేంద్రమంత్రి పెమ్మసాని తెలిపారు.


ఆ భూముల విషయంలో ఇబ్బంది లేదు: నారాయణ

అమరావతి రాజధాని రైతుల సమస్యలను త్రి సభ్య కమిటీ ఎప్పటికప్పుడు తెలుసుకుంటోందని మంత్రి నారాయణ (Minister Narayana) అన్నారు. గ్రామ కంఠాల్లో ఇచ్చిన భూములు, జరీబు, నాన్ జరీబు అన్ని భూములపై దృష్టి పెడతామని చెప్పారు. వచ్చే క్యాబినెట్‌లో అసైన్డ్ భూములు, లంక భూములపై చర్చించనున్నట్లు తెలిపారు. అమరావతి రాజధాని గ్రామాల్లో హెచ్‌డీ లైన్స్, ఇతర మౌలిక వసతులపై దృష్టి పెట్టామన్నారు. గ్రామకంఠాల్లో ఎవరికైతే ప్లాట్లు ఇచ్చారో వాటిపై ఉన్న అనుమానాల నేపథ్యంలో అన్ని వెరిఫై చేయమని అధికారులకు చెప్పినట్లు తెలిపారు.


లంక భూముల విషయంలో ప్రస్తుతానికి ఇబ్బంది లేదన్నారు. ఆర్ అండ్ బి రోడ్‌లకు సంబంధించి పరిహారం తక్షణం వచ్చేలా సీఆర్డీఏ చూస్తుందన్నారు. ఆర్ అండ్ బి ఇవ్వాల్సిన పరిహారాన్ని సీఆర్డీఏ ముందుగా చెల్లిస్తుందన్నారు. ఉదయం 9 గంటలకు సమావేశమంటూ సమయమిచ్చామని.. అయితే కొందరు రైతుల ఆలస్యంగా వచ్చారని తెలిపారు. వచ్చే సమావేశం నాటికి అందరినీ పిలుస్తామని మంత్రి నారాయణ పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి..

శబరి యాత్రలో జగన్ జపం... అయ్యప్ప భక్తుల ఆగ్రహం

కర్నూలు రోడ్డు ప్రమాదంపై సీఎం చంద్రబాబు విచారం

Read Latest AP News And Telugu News

Updated Date - Nov 29 , 2025 | 12:58 PM