Santhi: ఆదుకోవాలంటూ మంత్రి లోకేశ్‌కు మహిళ వీడియో సందేశం..
ABN , Publish Date - Oct 23 , 2025 | 12:55 PM
విదేశాలకు వెళ్లి చిక్కుపోయిన యువతి.. తనను రక్షించాలంటూ మంత్రి నారా లోకేశ్‌తోపాటు ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్‌కు విజ్ఞప్తి చేసింది.
మచిలీపట్నం, అక్టోబర్ 23: ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మహిళ కువైట్‌లో చిక్కుకుపోయింది. ఆర్థిక పరిస్థితులు అనుకూలించకపోవడంతో.. తనను స్వస్థలానికి తీసుకురావాలంటూ మంత్రి నారా లోకేశ్‌తోపాటు తన నియోజకవర్గ ఎమ్మెల్యే, టీడీపీ నేత కాగిత కృష్ణ ప్రసాద్‌కు వీడియో ద్వారా విజ్ఞప్తి చేసింది. ఉమ్మడి కృష్ణాజిల్లాలోని పెడన మండలం జింజేరు గ్రామానికి చెందిన శాంతి ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతుంది. ఈ నేపథ్యంలో బ్రోకర్ల ద్వారా ఆమె కువైట్‌కు వెళ్లింది. అక్కడ ఒక ఇంట్లో పనికి కుదిరింది.
అయితే ఆ ఇంట్లోని వారు.. ఆమెను ఇబ్బందులకు గురి చేయడమే కాకుండా.. జీతం సైతం చెల్లించడం లేదు. దీంతో కువైట్‌లో తన ఆర్థిక పరిస్థితి ఏ మాత్రం బాగోలేదంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేస్తూ ఒక వీడియోను విడుదల చేసింది. తనను కువైట్ నుంచి స్వస్థలానికి పంపాలంటూ మంత్రి నారా లోకేశ్‌తోపాటుపెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్‌ను ఆ వీడియోలో కోరింది.
ఈ వార్తలు కూడా చదవండి..
నారాయణరావు మృతి.. ఆందోళనకు దిగిన కుటుంబ సభ్యులు
For More AP News And Telugu News