Somireddy: ఆ భయంతోనే అసెంబ్లీకి జగన్
ABN , Publish Date - Feb 24 , 2025 | 10:30 AM
Somireddy: ఏపీ అసెంబ్లీకి వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ రావడంపై ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్ష హోదా లేని పార్టీకి ప్రతిపక్ష హోదా ఎలా ఇస్తారని ప్రశ్నించారు. ఈయన కోసం ఏమైనా ప్రత్యేక చట్టం తీసుకురావాలా అంటూ కామెంట్స్ చేశారు.

అమరావతి, ఫిబ్రవరి 24: మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ (Former CM YS Jagan Mohan Reddy) అసెంబ్లీకి హాజరుకావడంపై టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి స్పందించారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. అనర్హత వేటు భయంతోనే జగన్ అసెంబ్లీకి వస్తున్నారని అన్నారు. జగన్ ఈ ఒక్కరోజే అసెంబ్లీకి వస్తారా అన్ని రోజులు వస్తారో తెలియదన్నారు. ప్రతిపక్ష హోదా లేని పార్టీకి ప్రతిపక్ష హోదా ఎలా ఇస్తారని ప్రశ్నించారు. ఈయన కోసం ఏమైనా ప్రత్యేక చట్టం తీసుకురావాలా అంటూ కామెంట్స్ చేశారు. జగన్‌కు మోడీ కాళ్ల మీద పడే అలవాటు ఉందని.. అలవాటుతోనే ఆయన కాళ్ళ మీద పడి అసెంబ్లీలోకి వెళ్లేందుకు చట్టం మార్పు చేసి తెచ్చుకో అంటూ ఎద్దేవా చేశారు. తన హయాంలో జరిగిన వ్యవహారాలన్నీ తెరపైకి వస్తాయనే భయంతోనే అసెంబ్లీకి జగన్ ముఖం చాటేస్తున్నారంటూ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు.
కాగా.. ఈరోజు అసెంబ్లీకి హాజరుకావాలని వైసీపీ నిర్ణయించింది. గవర్నర్ ప్రసంగం కావడంతో ఈ రోజు సభకు రావాలని నిర్ణయించింది వైసీపీ. వైసిపి శాసనసభ పక్ష సమావేశం ఏర్పాటు చేసి తదనంతర కార్యాచరణ ప్రణాళిక నిర్ణయించాలని ఆ పార్టీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. రేపు ఎల్లుండి కడప జిల్లాలో వైసీపీ అధినేత పర్యటించనున్నారు. ప్రతిపక్ష హోదా ఇస్తేనే సభకు వస్తానని గతంలో జగన్ ప్రకటించిన విషయం తెలిసిందే. మళ్ళీ ప్లేట్ మార్చి సభకు ఈరోజు హాజరుకావాలని నిర్ణయించారు. అయితే సభకు 60 రోజులు హాజరు కాకపోతే అనర్హత వేటు పడుతుందనే భయంతోనే వస్తున్నారని వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
Road Accident: అందరూ నిద్రిస్తుండగా ప్రమాదానికి గురైన బస్సు.. చివరికి పరిస్థతి ఇది..
నేటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరుగనున్నాయి. 20 రోజులు పాటు బడ్జెట్ సమావేశాలు నిర్వహించనున్నారు. ఉదయం 10 గంటలకు గవర్నర్ ప్రసంగంతో సమావేశాలు ప్రారంభమయ్యాయి. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో అసెంబ్లీతో పాటు ప్రకాశం బ్యారేజ్ నుంచి అసెంబ్లీకి వెళ్లే మార్గాల్లో కూడా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. అసెంబ్లీ ఆవరణలో మంత్రుల, ఎమ్మెల్యేల పీఏలకు అనుమతి నిరాకరించారు. ముఖ్యమంత్రి, మంత్రులను కలిసేవారు నేరుగా సీఎంవొకే వెళ్లాలని స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఆదేశాలు జారీ చేశారు.
ఇవి కూడా చదవండి...
స్థిరంగా బంగారం ధరలు.. ఈరోజు రేటు ఎలా ఉందంటే..
Read Latest AP News And Telugu News