Buddha warn to KTR: మాతో పెట్టుకుంటే మాడి మసైపోతారు..
ABN , Publish Date - Mar 10 , 2025 | 11:17 AM
Buddha warn to KTR: మాజీ మంత్రి కేటీఆర్‌కు ఏపీ టీడీపీ నేత బుద్దా వెంకన్న స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. నోటి దూలతో ప్రభుత్వం పోయిందని.. ఇలాగే ఉంటే సిరిసిల్లలో కూడా గెలవరంటూ హెచ్చరించారు.

విజయవాడ, మార్చి 10: బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌పై (Former Ministe KTR) ఏపీ టీడీపీ నేత బుద్దా వెంకన్న (TDP Leader Buddha Venkanna) తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణా ప్రజలు బుద్ది చెప్పినా కేటీఆర్‌కు వెకిలి మాటలు, వెకిలి చేష్టలు పోలేదన్నారు. ఎన్నికల ముందు చంద్రబాబు అరెస్టు సమయంలో ఇలాగే వాగారని.. అక్కడ కార్యక్రమాలు చేస్తుంటే.. అడ్డుకుని వెకిలిగా కేటీఆర్ మాట్లాడారన్నారు. ‘పక్క రాష్ట్రంలో చేసుకోండి అన్నందుకు.. మీ ప్రభుత్వం కుప్పకూలిపోయింది. మీ పార్టీ తుడిచిపెట్టుకు పోవడానికి కేటీఆర్ వెకిలిగా మాట్లాడమే కారణం. గతంలో కేసీఆర్ కూడా ఇలా నోరు పారేసుకుంటేనే.. ప్రజలు బుద్ది చెప్పారు. జగన్ వంటి అవినీతి పరుడితో జతకట్టిన నువ్వు కూడా మాకు నీతులు చెప్పేవాడివా. ఏపీపై నోరు పారేసుకుంటున్న కేటీఆర్ నీ నోరు జాగ్రత్తగా ఉంచుకో. తెలంగాణాలో బీఆర్‌ఎస్‌కు దిక్కు లేదు.. మీరు ఏపీ గురించి మాట్లాడుతున్నారు’ అంటూ విరుచుకుపడ్డారు.
ఏపీకి కూడా పెట్టుబడులు వచ్చాయని.. తెలంగాణా రాలేదు అంటూ తమ రాష్ట్రాన్ని చిన్న చూపు చూస్తావా అంటూ ఫైర్ అయ్యారు. ఏపీకి చంద్రబాబు అనే బ్రాండ్ ఉందని.. ప్రపంచ దేశాలు ఆయన్ను చూసి ఏపీకి వస్తాయన్నారు. చంద్రబాబును అరెస్టు చేస్తే.. వంద దేశాల్లో నిరసం చేశారని.. అది ఆయన స్ఠామినా అని చెప్పుకొచ్చారు. ఇలాగే నోటి దూలతో ప్రభుత్వం పోయిందని.. ఇలాగే ఉంటే సిరిసిల్లలో కూడా గెలవరని హెచ్చరించారు. చంద్రబాబు పాలన గురించి జాతీయ , అంతర్జాతీయ స్థాయిలో ఒక ఇమేజ్ ఉందని తెలిపారు. కేటీఆర్ లాంటి వాళ్లు ఏదో వాగారని.. ఆయన గొప్పతనం తగ్గదన్నారు. ‘చంద్రబాబు గురించి.. నీకు తెలియదేమో.. మీ నాన్నకు తెలుసు’ అని అన్నారు.
జగన్ వికృత చేష్టలతో చంద్రబాబును ఎన్నో విధాలుగా ఇబ్బందులు పెట్టారని మండిపడ్డారు. జగన్ జైలుకు వెళితే లక్ష కోట్లు దోచుకున్నారు కాబట్టి వెళ్లారని ప్రజలే చెప్పారని.. చంద్రబాబును జైలుకు పంపితే.. అన్యాయంగా కేసులు పెట్టారని ప్రజలు రోడ్ల మీదకు వచ్చారన్నారు. చంద్రబాబు గురించి మాట్లాడేటప్పుడు ఒకసారి ఆలోచన చేస్తే మంచిదనన్నారు. చంద్రబాబు కటౌట్ చాలు.. ఈ భారతదేశానికి అని చెప్పారు. ఎపీ గురించి కానీ, చంద్రబాబు గురించి కానీ మాట్లాడేటప్పులు ఒళ్లు దగ్గర పెట్టుకోవాలని.. తీరు మార్చుకోక పోతే ప్రజలే సిరిసిల్ల నుంచి తరిమి కొట్టడం ఖాయమని ఆయన హెచ్చరించారు.
ఎమ్మెల్సీ పదవిపై..
‘నాకు చంద్రబాబు దేవుడితో సమానం.. అప్పుడప్పుడు దేవుళ్లు భక్తులకు పరీక్ష పెడతుంటారు. నేను చంద్రబాబుగారి కోసం అంకిత భావంతో పని చేస్తా. అక్కడ అనేక రకాల పరిణామాలను చూసుకుని ఎమ్మెల్సీ పేర్లను ప్రకటించారు. రాజకీయాలలో పదవులు అనేవి ఒక క్రీడ.. ఒక్కోసారి గెలుస్తాం.. ఒక్కోసారి ఓడతాం. నాకు పదవులు ఇచ్చినా, ఇవ్వకున్నా.. చంద్రబాబు నా జీవితాంతం నాకు దేవుడు. చంద్రబాబును ఎవరు ఎక్కడా దూషించినా.. నేను ఇలాగే ముందుంటా.. వారికి సమాధానం చెబుతా. నాకు ఎటువంటి నిరుత్సాహం లేదు.. కొత్తగా ఎంపికైన వారికి నా శుభాకాంక్షలు. నాకు ఎప్పుడు ఏమి ఇవ్వాలో నా దేవుడు చంద్రబాబుకు తెలుసు. ఇప్పుడు కూడా ఇద్దరు బీసీలకు, ఒక ఎస్సీకి ఎమ్మెల్సీలుగా అవకాశం కల్పించారు. వారికి ఇవ్వడంలో న్యాయం ఉంది.. టీడీపీ కార్యకర్తలు కూడా సోషల్ మీడియాలో వ్యతిరేకంగా పోస్టులు పెట్టద్దు’’ అని బుద్దా వెంకన్న విజ్ఞప్తి చేశారు.
ఇవి కూడా చదవండి..
Twists in TG Politics: తెలంగాణలో మారుతున్న రాజకీయం.. కలిసొచ్చేదెవరికి
BJP MLC candidate: బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా సోమువీర్రాజు
Read Latest AP News And Telugu News