Buddha Venkanna Slams Jogi: తప్పు చేసి సిగ్గు లేకుండా వాగుతున్నారు.. జోగిపై బుద్దా ఫైర్
ABN , Publish Date - Oct 16 , 2025 | 11:51 AM
జోగి రమేష్ కీలక పాత్ర ఉందని జనార్ధన్ స్వయంగా ప్రకటించారని.. తప్పు చేసి దొరికిపోయి కూడా జోగి రమేష్ సిగ్గు లేకుండా వాగుతున్నారని బుద్దా వెంకన్న మండిపడ్డారు. కల్తీ మద్యంతో సంబంధం లేని చంద్రబాబు ఎందుకు ప్రమాణం చేయాలని ప్రశ్నించారు.
విజయవాడ, అక్టోబర్ 16: నకిలీ మద్యంపై రాష్ట్ర వ్యాప్తంగా చర్చ సాగుతోందని టీడీపీ నేత బుద్దా వెంకన్న (Budha Venkanna) అన్నారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ.. జోగి జోగి కలిస్తే బూడిద రాలినట్లు జగన్, జోగి రమేష్ కలిస్తే బూడిద రాలుతుందని తేలి పోయిందని వ్యాఖ్యలు చేశారు. గత ఐదేళ్లల్లో జగన్ అవినీతిని, హత్యలు చేసిన వారిని ప్రోత్సహించారని.. అదే చంద్రబాబు అయితే వెంటనే వారిపై చర్యలు తీసుకున్నారని అన్నారు. జోగి రమేష్ కీలక పాత్ర ఉందని జనార్ధన్ స్వయంగా ప్రకటించారని.. తప్పు చేసి దొరికిపోయి కూడా జోగి రమేష్ సిగ్గు లేకుండా వాగుతున్నారని మండిపడ్డారు. కల్తీ మద్యంతో సంబంధం లేని చంద్రబాబు ఎందుకు ప్రమాణం చేయాలని ప్రశ్నించారు.
‘జోగి రమేష్, జనార్ధన్ స్నేహితులం అని చెప్పలేదా. మీ ఇద్దరి మధ్య వాట్సప్ చాటింగ్, ఫేస్ టైమ్ కాల్స్ మాట్లాడింది వాస్తవం కాదా, నువ్వు ఏ తప్పు చేయకపోతే సిట్ ముందుకు వెళ్లు. నీ దగ్గర ఉన్న ఆధారాలు ఇచ్చి సచ్చీలత నిరూపించుకో’ అంటూ సవాల్ విసిరారు. జగన్ అవినీతి గురించి లోకమంతా తెలుసన్నారు. ఆయన మద్యం కుంభకోణం వల్ల 12 మంది జైలుకు వెళ్లారని.. ఇప్పుడు నకిలీ మద్యం విషయంలో జోగి రమేష్ అడ్డంగా దొరికిపోయారని అన్నారు. ఇంత జరుగుతున్నా జగన్ నిద్ర పోతున్నాడా... జోగి రమేష్‌ను ఎందుకు సస్పెండ్ చేయలేదని నిలదీశారు. కొడాలి నానీ, పేర్ని నాని, దేవినేని అవినాష్, వెల్లంపల్లి, వల్లభనేని వంశీ వీరంతా గత ప్రభుత్వంలో నోటికొచ్చినట్లు వాగారని.. మహిళలని కూడా చూడకుండా దూషించారని బుద్దా వెంకన్న మండిపడ్డారు.
ఇవి కూడా చదవండి...
రెచ్చిపోయిన సైకో.. తల్లిదండ్రులపైనే
అగ్ని-6 పరీక్షకు భారత్ సిద్ధం...
Read Latest AP News And Telugu News