Share News

Purandeswari: సోనియా, రాహుల్ ఇదే కేసులో బెయిల్‌పై ఉన్నారు..

ABN , Publish Date - Apr 18 , 2025 | 01:20 PM

సోనియా గాంధీ, రాహుల్ పేర్లను నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ చేర్చడంపై కాంగ్రెస్ రాద్దాంతం చేస్తోందని, ఈ కేసులో ఇప్పటికే సోనియా, రాహుల్ బెయిల్‌ప ఉన్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు, ఎంపీ పురందేశ్వరి అన్నారు.

Purandeswari: సోనియా, రాహుల్ ఇదే కేసులో బెయిల్‌పై ఉన్నారు..
MP Purandeswari Press Meet

అమరావతి: నేషనల్ హెరాల్డ్ కేసు (National Herald case)లో సోనియా (Gandhi), రాహుల్ గాంధీ (Rahul Gandhi)ల పేర్లు చేర్చడం బీజేపీ (BJP) విద్వేషం అని దుష్ప్రచారం చేయడంపై రాష్ట్ర పార్టీ అధ్యక్షురాలు, ఎంపీ పురంధేశ్వరి (MP Purandeswari) మండిపడ్డారు. సోనియా, రాహుల్ ఇదే కేసులో బెయిల్‌ (Bail)పై ఉన్నారని పేర్కొన్నారు. శుక్రవారం వక్ఫ్ (Wakf) సంస్కరణల ప్రజా అవగాహన (Awareness) అభియాన్‌ను దగ్గుబాటి పురంధేశ్వరి ప్రారంభించారు. సవరణలు చేసి కొత్త చట్టాన్ని తీసుకురావడానికే అవగాహన సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా పురందేశ్వరి మీడియాతో మాట్లాడారు. బీజేపీ కేంద్రంలో అధికారంలో లేనప్పుడు నమోదు అయిన కేసుపై బీజేపీపై బురద చల్లడం ఏమిటని ఆమె ప్రశ్నించారు.

Also Read..: గోల్డ్ ధరలు పెరగడానికి కారణం ఇదే..


అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్‌లో 5 వేల మంది స్వాతంత్య్ర సమరయోధులు పెట్టుబడి పెట్టారని, 1057 మంది స్వాతంత్య్ర సమరయోధులు మాత్రమే అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్‌లో మిగిలారని పురందేశ్వరి పేర్కొన్నారు. వడ్డీ లేని రూ. 90 కోట్ల రుణాన్ని అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్‌కు కాంగ్రెస్ ఇచ్చిందన్నారు. యంగ్ ఇండియా అనే కంపెనీని రూ. 5 లక్షల పెట్టుబడితో పెట్టారని.. ఇందులో 76 శాతం వాటా సోనియా, రాహుల్‌దేనని అన్నారు. అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ అప్పులు తీర్చేస్తామని చెప్పి కంపెనీ సహా ఆస్తులను సైతం యంగ్ ఇండియా తీసుకుందన్నారు. 2012లో సుబ్రహ్మణ్యస్వామి కాంగ్రెస్ పార్టీ అప్పు ఇవ్వడం, వాటాదారులు 1050 మందికి చెప్పకుండా ఎలా చేస్తారనే అంశంపై కోర్టుకు వెళ్ళారని పురందేశ్వరి ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఇది బీజేపీ ప్రమేయం లేని అంశమని.. సుబ్రహ్మణ్య స్వామి కేసు వేసే నాటికి బీజేపీ అధికారంలో లేదని అన్నారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఈ కేసు తీసుకుని అన్ని వివరాలతో సహా ఛార్జిషీటు వేసిందని పురందేశ్వరి పేర్కొన్నారు.


వక్ఫ్ విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై వస్తున్న వాదనలపై పురందేశ్వరి క్లారిటీ ఇచ్చారు. ఈ చట్టంలో ధర్మాసనం జోక్యం చేసుకోవడం లేదని అంటూనే గుర్తించబడిన వక్ఫ్ ఆస్తులలో మార్పులు చేయవద్దని సుప్రీంకోర్టు పేర్కొందన్నారు. కొత్త బోర్డు ఏర్పాటు చేసేప్పుడు కొత్త చట్టం ప్రకారం జరగాలని.. ఇప్పుడున్న వక్ఫ్ బోర్డు విషయంలో తలదూర్చడ లేదని న్యాయస్థానం పేర్కొందన్నారు. వక్ఫ్ ధార్మిక వ్యవస్థ వక్ఫ్ విషయంలో కేంద్ర ప్రభుత్వానికి సంబందం లేదని పురందేశ్వరి స్పష్టం చేశారు. వక్ఫ్ బోర్డు విషయంలో సవరణలు చేస్తే విపక్షాలు అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నాయని మండిపడ్డారు. దేశ సర్వోన్నత న్యాయస్థానం చెప్పిన విషయాలు, కేంద్ర ప్రభుత్వం చెబుతున్నదీ ఒక్కటేనని అన్నారు. వక్ఫ్ విషయంలో బీజేపీ పీపీటీని ఈ సందర్భంగా పురందేశ్వరి ప్రదర్శించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

బీసీసీఐ సీరియస్..ముగ్గురిపై చర్యలు..

భూమన కరుణాకర్ రెడ్డిపై కేసు నమోదు

సిట్ విచారణకు విజయసాయి రెడ్డి

For More AP News and Telugu News

Updated Date - Apr 18 , 2025 | 01:20 PM