High Court Relief: రాంగోపాల్ వర్మకు ఏపీ హైకోర్టులో ఊరట..
ABN , Publish Date - Mar 06 , 2025 | 11:54 AM
సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ ఫోటోలు మార్ఫింగ్ చేసి రాంగోపాల్ వర్మ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. దీనిపై కేసు నమోదైంది. ఆ కేసును కొట్టివేయాలని కోరుతూ వర్మ హైకోర్టును ఆశ్రయించారు. విచారణ జరిపిన న్యాయస్థానం కేసు ఆధారంగా 6 వారాల పాటు చర్యలు నిలుపుదల చేస్తూ.. తదుపరి విచారణ ఏప్రిల్ 17 వ తేదీకి వాయిదా వేసింది.

అమరావతి: వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ (Controversial director Rangoapol Varma)కు ఏపీ హైకోర్టు (AP High Court)లో స్వల్ప వూరట (Relief) లభించింది. కులాల మధ్య వైషమ్యాలు రెచ్చగొట్టేలా కమ్మ రాజ్యంలో కడప రెడ్లు సినిమా తీశానని, మార్ఫింగ్ ఫోటోలు (Morphing Photos) సోషల్ మీడియా (Social Media)లో పోస్టు చేశానని ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా సీఐడీ పోలీసులు (CID Police) నమోదు చేసిన కేసును కొట్టివేయాలని కోరుతూ వర్మ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం కేసు ఆధారంగా 6 వారాల పాటు చర్యలు నిలుపుదల చేస్తూ.. తదుపరి విచారణ ఏప్రిల్ 17 వ తేదీకి వాయిదా వేసింది.
ఈ వార్త కూడా చదవండి..
పోసాని కి బెయిల్ వచ్చేనా.. ఎందుకంటే..
కాగా ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ ఫోటోలు మార్ఫింగ్ చేసి రాంగోపాల్ వర్మ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. దీనిపై గత ఏడాది నవంబర్ 10న వర్మ పై మద్దిపాడు పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. నవంబర్ 19, 25 తేదీల్లో రెండు సార్లు నోటీసులు ఇచ్చినా ఆయన విచారణకు హాజరు కాలేదు. పోలీస్ విచారణకు హాజరుకాకుండా కొద్ది రోజులు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. అయితే ఈ కేసులో పోలీసులు అరెస్టు చేయకుండా ఉండేందుకు న్యాయస్థానాన్ని ఆశ్రయించి ముందస్తు బెయిల్ పొందారు. ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూనే.. పోలీసుల విచారణకు సహకరించాలని ఆర్జీవీని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆదేశించింది.
కాగా రాంగోపాల్ వర్మ పలుసార్లు పోలీసుల విచారణకు డుమ్మా కొడుతూ వచ్చారు. పలుమార్లు పోలీసులు నోటీసులు ఇవ్వడం.. ఆయన డుమ్మా కొట్టడం జరుగుతూ వచ్చాయి.. తాజాగా ఫిబ్రవరి 4న విచారణకు హాజరుకావాలని సీఐ శ్రీకాంత్ నోటీసులు ఇచ్చారు. ఈ నోటీసులపై స్పందించిన ఆర్జీవీ.. 7న విచారణకు వస్తానని పోలీసులకు సమాచారం ఇచ్చారు. అన్న మాట ప్రకారం రాంగోపాల్ వర్మ శుక్రవారం (ఫిబ్రవరి 7వ తేదీ) పోలీసు విచారణకు (Police Investigation) హాజరయ్యారు. ఒంగోలు (Ongole)లో రూరల్ పోలీస్ స్టేషన్‌లో వర్మపై నమోదైన కేసు (Case)పై విచారణ జరిగింది.
ఈ వార్తలు కూడా చదవండి..
ఎన్టీఆర్ ట్రస్ట్ లక్ష్యం అదే..: నారా భువనేశ్వరి
ఏపీలో వేర్వేరు చోట్ల రోడ్డు ప్రమాదాలు..
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News