PM Modi: చంద్రబాబుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ
ABN , Publish Date - Apr 20 , 2025 | 09:45 AM
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 75వ పుట్టిన రోజు సందర్భంగా ఆయనకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ శుభాకాంక్షల తెలియజేశారు. భవిష్యత్ రంగాలపై దృష్టి సారించి, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం చంద్రబాబు కృషి.. చేస్తున్న తీరును ప్రశంసనీయమని ప్రధాని మోదీ అన్నారు.

న్యూఢిల్లీ: తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు (AP CM Chandrababu Naidu) ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Narendra Modi) జన్మదిన శుభాకాంక్షలు (Birthday Greetings) తెలిపారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియా (Social Media) ఎక్స్ (X)లో పోస్ట్ చేశారు. "నా మంచి స్నేహితుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి శుభాకాంక్షలు. భవిష్యత్ రంగాలపై దృష్టి సారించి, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం ఆయన అవిశ్రాంతంగా కృషి చేస్తున్న తీరు ప్రశంసనీయం. ఆయన దీర్ఘాయుష్షు, ఆరోగ్యవంతమైన జీవితం కోసం ప్రార్థిస్తున్నాను" అని పేర్కొన్నారు.
కాగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సోమవారం ఆంధ్రప్రదేశ్ పర్యటనకు రానున్నారు. రాజధాని అమరావతి పునర్ నిర్మాణ పనులను ఆయన ప్రారంభిస్తారు. మూడు ఏళ్లలో అసెంబ్లీ, హైకోర్ట్, సచివాలయం, అమరావతి పనులు మొత్తం పూర్తయి తీరాల్సిందేనని, అందుకు సంబంధించిన పనులకు టెండర్లు పిలిచామని సీఎం చంద్రబాబు చెప్పిన విషయం తెలిసిందే. దీంతో ప్రధాని మోదీ శంకుస్థాపన అనంతరం రాజధాని అమరావతి పనులు ఊపందుకొన్నున్నాయి. మరోవైపు ఇప్పటికే రాజధాని నిర్మాణ పనులు జరుగుతోన్నాయి.
Also Read..: గుజరాత్ పర్యటనకు నారాయణ బృందం..
కాగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర సమగ్రాభివృద్ధికి కంకణబద్ధులైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు జనసేన నేత, మంత్రి నాదెండ్ల మనోహర్ హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. సుదీర్ఘ పరిపాలన అనుభవంతో రాష్ట్ర దిశా దశను మార్చే సమర్థత కలిగిన నాయకుడని ఆయన కొనియాడారు. భావి తరాలకు బంగారు భవిష్యత్తు ఇచ్చేందుకు నిరంతరం తపించే చంద్రబాబుకు సంపూర్ణ ఆయురారోగ్యాలు.. సంతోషాలు అందించాలని శ్రీ వేంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తున్నానని మంత్రి నాదెండ్ల అన్నారు. కాగా తిరుమలలో సీఎం చంద్రబాబు జన్మదిన వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. టీడీపీ మీడియా కోఆర్డినేటర్ శ్రీధర్ వర్మ అఖిలాండం వద్ద 750 టెంకాయలు కొట్టి..7.5 కిలోల కర్పూరం వెలిగించి మొక్కులు తీర్చుకున్నారు.
మరోవైపు ఏపీ సీఎం చంద్రబాబు 75వ పుట్టిన రోజు సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో వేడుకలకు టీడీపీ నేతలు, శ్రేణులు ఏర్పాట్లు చేశారు. మంగళగిరి ఎన్టీఆర్ భవన్‌లో చంద్రబాబు పుట్టిన రోజు వేడుకలు జరుగుతున్నాయి. చంద్రబాబుపై ఇటీవల రూపొందించిన ఓ పాటను ఆవిష్కరించారు. అసెంబ్లీ కమిటీ హాలులో చంద్రబాబు అసెంబ్లీ ప్రసంగాలపై.. రూపొందించిన రెండు పుస్తకాలను స్పీకర్ అయ్యన్నపాత్రుడు, ఉపసభాపతి రఘురామ కృష్ణం రాజు ఆవిషకరించనున్నారు. అలాగే హైదరాబాద్ టీడీపీ సెంట్రల్ ఆఫీస్‌లో చంద్రబాబు పుట్టిన రోజు వేడుకలు జరుగుతున్నాయి.
ఈ వార్తలు కూడా చదవండి..
బీచ్ ఫెస్టివల్‌ను ప్రారంభించిన కేంద్ర మంత్రి
సీఎం చంద్రబాబుకు గవర్నర్, పవన్ జన్మదిన శుభాకాంక్షలు
For More AP News and Telugu News