Share News

PM Modi: గన్నవరం ఎయిర్‌పోర్టుకు మోదీ.. ఘన స్వాగతం

ABN , Publish Date - May 02 , 2025 | 03:47 PM

PM Modi: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఏపీకి చేరుకున్నారు. గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న ప్రధానికి స్పీకర్, డిప్యూటీ స్పీకర్, మంత్రులు స్వాగతం పలికారు.

PM Modi: గన్నవరం ఎయిర్‌పోర్టుకు మోదీ.. ఘన స్వాగతం
PM Modi Gannavaram Airport

అమరావతి, మే 2: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Narendra Modi) గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. ఈ సందర్భంగా ప్రధానికి స్పీకర్ అయ్యన్నపాత్రుడు, డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు, మంత్రులు ఘన స్వాగతం పలికారు. అనంతరం గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి పీఎం వెలగపూడికి చేరుకున్నారు. వెలగపూడిలో మోదీకి గవర్నర్‌ అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu), డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Deputy CM Pawan Kalyan) స్వాగతం పలికారు.


modi-airport.jpg

మోదీకి స్వాగతం పలికింది వీరే

  • ఏపీ హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత

  • ఏపీ అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు

  • ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు

  • ఏపీ రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్య ప్రసాద్

  • ఏపీ లేబర్ మినిస్టర్ వాసంశెట్టి సుభాష్

  • అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్

  • మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలసౌరి

  • రాజ్యసభ ఎంపీ పాక వెంకట సత్యనారాయణ,

  • గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు

  • ఎమ్మెల్సీ సోము వీర్రాజు

  • ఎమ్మెల్సీ కోణిదల నాగబాబు

  • ఎమ్మెల్సీ పంచమర్తి అనురాధ

  • విజయవాడ వెస్ట్ ఎమ్మెల్యే యలమంచిలి సుజనా చౌదరి

  • కైకలూరు ఎమ్మెల్యే కామినేని శ్రీనివాసరావు

  • వైజాగ్ నార్త్ ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు

  • మైదుకూరు ఎమ్మెల్యే సి ఆదినారాయణ రెడ్డి

  • మాజీ రాజ్యసభ ఎంపీ కంభంపాటి రామ్మోహన్ రావు

  • స్పెషల్ సెక్రటరీ జి అనంత రాము

  • ఏడీజీపీ అంజనీ కుమార్

  • కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ

  • కృష్ణా జిల్లా ఎస్పీ ఆర్ గంగాధర్

Jagan Batch High Court: మద్యం కుంభకోణం కేసులో ఆ ముగ్గరికి ఎదురుదెబ్బ


మరికాసేపట్లో అమరావతి పున:ప్రారంభ పనులకు పీఎం శంకుస్థాపన చేయనున్నారు. సభా వేదిక పై నుంచే శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. మొత్తం 18 ప్రాజెక్టులకు ప్రధాని శంకుస్థాపనలు చేస్తారు. రాజధాని పనులు సహా రూ.57,940 కోట్ల ప్రాజెక్టులకు ప్రధాని మోదీ శంకుస్థాపనలు చేయనున్నారు.


ఇవి కూడా చదవండి

Kesireddy SIT Custody: రాజ్ కేసిరెడ్డిని కస్టడీలోకి తీసుకున్న సిట్

Gopi ACB Custody: రెండో రోజు ఏసీబీ కస్టడీకి గోపి

Read Latest AP News And Telugu News

Updated Date - May 02 , 2025 | 04:30 PM