Satyakumar Review Meeting: పరిశ్రమల కేంద్రంగా ఎన్టీఆర్ జిల్లా: మంత్రి సత్యకుమార్
ABN , Publish Date - Jul 05 , 2025 | 04:21 PM
Satyakumar Review Meeting: స్వర్ణాంధ్ర నిర్మాణానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని మంత్రి సత్యకుమార్ వెల్లడించారు. అగ్రికల్చరల్, ఇండస్ట్రీయల్, సర్వీస్ సెక్టార్లపై ప్రత్యేక దృష్టి పెట్టామన్నారు. చిరు వ్యాపారులు ఆర్ధికంగా ఎదిగేందుకు అవసరమైన చేయూతను ఇస్తామని ప్రకటించారు.

విజయవాడ, జులై 5: ఎన్టీఆర్ జిల్లా అభివృద్ధిపై అధికారులు, ప్రజా ప్రతినిధులతో ఇంఛార్జ్ మంత్రి సత్య కుమార్ (Minister Satya Kumar) ఈరోజు (శనివారం) సమీక్ష సమావేశం నిర్వహించారు. నియోజకవర్గాల వారీగా ఉన్న వనరులు, పరిశ్రమల ఏర్పాటు, పర్యాటక అభివృద్ధి వంటి అంశాలపై ఎమ్మెల్యేలు, ఎంపీని అడిగి తెలుసుకున్నారు మంత్రి. ఈ సందర్భంగా మంత్రి సత్యకుమార్ మాట్లాడుతూ.. ఎన్టీఆర్ జిల్లాను పారిశ్రామికంగా అభివృద్ధి చేసే విధంగా కార్యాచరణ సిద్ధం చేస్తున్నామన్నారు. నియోజకవర్గాల వారీగా ఉన్న వనరులను గుర్తించేలా టీంలను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. అభివృద్ధి కాంక్షకులుగా ఉన్న వారిని గుర్తించి.. వారి సలహాలను తీసుకుంటామన్నారు.
స్వర్ణాంధ్ర నిర్మాణానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని మంత్రి వెల్లడించారు. అగ్రికల్చరల్, ఇండస్ట్రీయల్, సర్వీస్ సెక్టార్లపై ప్రత్యేక దృష్టి పెట్టామన్నారు. చిరు వ్యాపారులు ఆర్ధికంగా ఎదిగేందుకు అవసరమైన చేయూతను ఇస్తామని ప్రకటించారు. ఏడాదికి ఏడాదికి లక్ష్యాలను నిర్దేశించుకుని.. వాటిని సాకారం చేసే దిశగా అడుగులు వేస్తామని స్పష్టం చేశారు. కృష్ణా తీర ప్రాంతాలను పర్యాటక ప్రదేశాలుగా అభివృద్ధి చేస్తామని చెప్పారు. గ్రామీణ ప్రాంతాలలో వ్యవసాయ ఆధారిత నియోజకవర్గాలలో వ్యవసాయం, పరిశ్రమలు నెలకొల్పడంపై శ్రద్ద పెడుతున్నామని అన్నారు. బ్యాంకుల నుంచి సబ్సీడీ రుణాలు ఇప్పించి.. వారు ఆర్థికంగా నిలబడేలా చేస్తామని తెలిపారు. రాష్ట్రంతో పాటు, ఇతర రాష్ట్రాల పారిశ్రామికవేత్తలు ఈ ప్రాంతాలలో పరిశ్రమల ఏర్పాటుకు ముందుకు వచ్చేలా అనుమతులను సరళతరం చేస్తామని మంత్రి అన్నారు.
మైనింగ్‌పై కూడా ప్రత్యేక దృష్టి పెట్టి.. అవసరమైన అనుమతులు ఇస్తామని అన్నారు. పర్యాటక ప్రదేశాల సందర్శనకు ప్రజలు ఆసక్తి చూపుతున్నారని.. అందుకే జిల్లాలో ఆయా ప్రదేశాలను ప్రణాళిక బద్ధంగా అభివృద్ధి చేసి ప్రజలు తిలకించేలా సౌకర్యాలు కల్పిస్తామన్నారు. యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేలా చేస్తామన్నారు మంత్రి. కొండపల్లి బొమ్మల ఖ్యాతిని మరింత పెంచడంతో పాటు కళాకారులను ప్రోత్సహిస్తామని అన్నారు. అమరావతి నుంచి అనేక ప్రధాన ప్రాంతాలకు వెళ్లేలా ప్రధాన రహదారులు అనుసంధానం చేస్తామన్నారు. త్వరలోనే ఎక్స్ ప్రెస్ హైవే కూడా వస్తున్న నేపథ్యంలో పరిశ్రమల ఏర్పాటుకు చర్చలు చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు. ప్రతీ అంశాన్ని పరిగణలోకి తీసుకుని అన్ని విధాలా ఎన్టీఆర్ జిల్లాను అభివృద్ది చేసేలా కార్యాచరణ సిద్ధం చేశామన్నారు. ఈ సమావేశంలో నియోజకవర్గాల వారీగా చర్చించామని.. తప్పకుండా త్వరలోనే ఫలితాలను అందరూ చూస్తారని మంత్రి సత్యకుమార్ పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఎంపీ కేశినేని శివనాథ్ చిన్ని, ఎమ్మెల్యేలు, కలెక్టర్ లక్ష్మీశా తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి
కోర్టు ఆదేశాలకు విరుద్ధంగా పీఎస్‌కు మాజీ మంత్రి
మీ యోగక్షేమాలు తెలుసుకోడానికే వచ్చా.. ధర్మవరంలో హోంమంత్రి
Read Latest AP News And Telugu News