Share News

Nandigama: నందిగామ మున్సిపల్ చైర్మన్‌‌గా మండవ కృష్ణకుమారి విజయం

ABN , Publish Date - Feb 04 , 2025 | 12:47 PM

Nandigama Municipal Chairman: నందిగామ మున్సిపల్ చైర్మన్‌గా మండవ కృష్ణకుమారి ఎన్నికయ్యారు. టీడీపీ అధిష్టానం ఆదేశాలతో కృష్ణకుమారికి మద్దతుగా ఎమ్మెల్యే, ఇతర సభ్యులు ఓటేశారు. మున్సిపల్ ఛైర్మన్‌గా ఎన్నికైన కృష్ణకుమారికి ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య, ఇతర సభ్యులు అభినందనలు తెలిపారు.

Nandigama: నందిగామ మున్సిపల్ చైర్మన్‌‌గా మండవ కృష్ణకుమారి విజయం
Nandigama Municipal Chairman

ఎన్టీఆర్ జిల్లా, ఫిబ్రవరి 4: నందిగామలో మూడు రోజుల ఉత్కంఠకు ఎట్టకేలకు తెరపడింది. నందిగామ మున్సిపల్ చైర్మన్‌‌గా (Nandigama Municipal Chairman) మండవ కృష్ణకుమారి (Mandava Krishnakumari) ఎన్నికయ్యారు. టీడీపీకి 15, వైసీపీకి అనుకూలంగా మూడు ఓట్లు పడటంతో కృష్ణకుమారి విజయం సాధించినట్లు అధికారులు ప్రకటించారు. టీడీపీ అధిష్టానం ఆదేశాలతో కృష్ణకుమారికి మద్దతుగా ఎమ్మెల్యే, ఇతర సభ్యులు ఓటేశారు. మున్సిపల్ ఛైర్మన్‌గా ఎన్నికైన కృష్ణకుమారికి ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య (MLA Tangirala Sowmya), ఇతర సభ్యులు అభినందనలు తెలిపారు. గత మూడు రోజులుగా నందిగామ మున్సిపల్ చైర్మన్‌ ఎన్నికకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. మొదటి నుంచి టీడీపీ ప్రతినిధిగా, ఎమ్మెల్యేగా తంగిరా సౌమ్య కొనసాగుతున్న విషయం తెలిసిందే.


మున్సిపల్ చైర్మన్ ఎన్నికకు సంబంధించి ఎమ్మెల్యే సౌమ్య ఓ పేరును ప్రతిపాదించగా, ఎంపీ కేశినేని శివనాథ్ మరో పేరు ప్రకటించడంతో టీడీపీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అధిష్టానికి కూడా ఎమ్మెల్యే, ఎంపీ చేరో పేరును ప్రతిపాదించారు. దీనిపై ఏకాభిప్రాయం కుదరకపోవడంతో నిన్నటి నుంచి పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. ఎప్పటి నుంచో పార్టీలో ఉన్న తంగిరాల సౌమ్య.. సత్యవతిని మున్సిపల్ చైర్మన్‌గా చేయాలని అధిష్టానానికి వినతి చేశారు. అలాగే స్వర్ణలతను చైర్మన్‌గా చేయాలని ఎంపీ ప్రతిపాదించారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఇరువురితో అధిష్టానం చర్చించినప్పటికీ ఏకాభిప్రాయం కుదరలేదు. నిన్న సభ్యులు కూడా ఎన్నికకు రాకపోవడంతో కోరం లేక ఎన్నిక నేటికి వాయిదా పడింది. ఈరోజు ఉదయం నుంచి అధిష్టానం జోక్యం చేసుకుని ఎంపీ, ఎమ్మెల్యే ప్రతిపాదించిన పేర్లు కాకుండా మరోపేరును తెరపైకి తీసుకొచ్చింది.


మండవ కృష్ణకుమారిపేరును ప్రస్తావించింది అధిష్టానం. దీనిపై ఎమ్మెల్యే సౌమ్యతో మంత్రి నారాయణ చర్చలు జరిపారు. అందరూ కూడా పార్టీ కోసం పనిచేయాలని కృష్ణకుమారిని ఏకగ్రీవంగా ఎన్నుకోవాలని సూచించారు. అయితే ఏకగ్రీవం అవుతుందని అందరూ అనుకున్నప్పటికీ వైసీపీ అనూహ్యంగా లక్ష్మీ అనే అభ్యర్థిని పోటీకి దింపింది. దీంతో ఓటింగ్ తప్పనిసరైంది. ఎన్నికల అధికారి పోలింగ్ నిర్వహించగా మొత్తం టీడీపీ, జనసేనకు చెందిన 15 మంది మండవ కృష్ణకుమారికి మద్దతు తెలుపగా.. వైసీపీకి సంబంధించి ఐదుగురు ఉన్నప్పటికీ కేవలం ముగ్గురు మాత్రమే ఓటింగ్‌లో పాల్గొన్నారు. చివరగా 15 మంది మద్దతుదారులతో మండవ కృష్ణకుమారి మున్సిపల్ చైర్మన్‌గా ఎన్నికైనట్లు అధికారికంగా ప్రకటించారు.


సౌమ్య స్పందన..

tangirala-sowmya.jpg

నందిగామ మున్సిపల్ ఛైర్మన్ ఎన్నిక ప్రక్రియ ప్రశాంతంగా ముగిసిందని ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య అన్నారు. అధిష్టానం ఆదేశాలతో అందరూ కృష్ణకుమారిని ఛైర్మన్‌గా ఎన్నుకున్నామని తెలిపారు. ‘‘టీడీపీలో అభిప్రాయ బేధాలు అని ‌కొంత మంది ప్రచారం చేశారు. మా టిడిపి ‌కుటుంబంలొ ఎటువంటి విభేధాలు లేవు, నా అభిప్రాయాలను పార్టీ అధిష్టానానికి వివరించాను. వారు అన్నీ పరిశీలించి కృష్ణకుమారి పేరును చైర్మన్‌గా ఎంపిక చేశారు. కొంతమంది కావాలనే మాపై అసత్య ప్రచారం చేశారు’’ అంటూ మండిపడ్డారు. ఓటింగ్ జరగదంటూ వైసీపీ సభ్యులు పడ్డ ఆనందం ఆవిరి అయ్యిందన్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఓటింగ్ ద్వారా మున్సిపల్ చైర్మన్ టీడీపీ దక్కించుకుందని తెలిపారు. నందిగామను అన్ని‌విధాలా అభివృద్ధి చేసి చూపుతామని స్పష్టం చేశారు. గత ప్రభుత్వంలో పనులు చేయకుండా దొంగ బిల్లులతో దోపిడీ చేశారని ఆరోపించారు. వాటి పై విచారణ చేసి తప్పకుండా తప్పు చేసిన వారి పై చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే సౌమ్య వెల్లడించారు.

ఇవి కూడా చదవండి..

సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక సమావేశం

తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో భారీ ఊరట

Read Latest AP News and Telugu News

Updated Date - Feb 04 , 2025 | 12:52 PM