Share News

Vangalapudi Anitha: వారి రక్షణ బాధ్యత మాదే: మంత్రి అనిత

ABN , Publish Date - Nov 13 , 2025 | 12:40 PM

భద్రత విషయంలో ఏపీ ప్రభుత్వం ఎక్కడా రాజీపడే ప్రసక్తే లేదని హోంమంత్రి అనిత స్పష్టం చేశారు. ప్రతీ వీఐపీ బాధ్యత తమదే అని పేర్కొన్నారు.

Vangalapudi Anitha: వారి రక్షణ బాధ్యత మాదే: మంత్రి అనిత
Vangalapudi Anitha

అమరావతి, నవంబర్ 13: విశాఖ పెట్టుబడుల సదస్సుకు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశామని హోంమంత్రి వంగలపూడి అనిత (Home Minister Anitha) తెలిపారు. గురువారం ఏబీఎన్ - ఆంధ్రజ్యోతితో (ABN - Andhrajyothy) మాట్లాడుతూ.. దాదాపు 3500 మంది పోలీసులతో పటిష్ట భద్రత చేపట్టామన్నారు. సదస్సుకు వచ్చే ప్రతీ వీఐపీ విమానాశ్రయంలో దిగిన దగ్గర నుంచి తిరిగి వారి గమ్యస్థానానికి చేరే వరకూ రక్షణ బాధ్యత తామే తీసుకున్నామన్నారు. భద్రత విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎక్కడా రాజీపడే పరిస్థితి లేదని స్పష్టం చేశారు. ఢిల్లీ పేలుళ్ల దృష్ట్యా రాష్ట్రమంతటా పూర్తి అప్రమత్తత కొనసాగుతోందని తెలిపారు.


తీవ్రవాదంతో పాటు రాజకీయ ఉగ్రవాదంపైనా ప్రభుత్వం సీరియస్‌గా ఉందన్నారు. భాగస్వామ్య సదస్సుపై జగన్ బ్యాచ్ సోషల్ మీడియాలో చేసే విష ప్రచారాన్ని ఉపేక్షించమని మండిపడ్డారు. ఒకప్పుడు వలసలు వెళ్లే ప్రాంతంగా ఉన్న ఉత్తరాంధ్రకు ఇప్పుడు అంతా వలస వచ్చే ప్రాంతంగా అభివృద్ధి చెందుతోందన్నారు. ఒకప్పుడు రాష్ట్రం నుంచి పారిపోయిన కంపెనీలు తిరిగి వస్తున్నాయంటే దానికి కారణం బ్రాండ్ సీబీఎన్, మంత్రి లోకేష్ కృషి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పట్టుదల అని పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి...

20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యం: మంత్రి డోలా

ఐదేళ్ల తర్వాత ఏపీకి రీన్యూ పవర్.. ఎక్స్‌లో లోకేష్ ట్వీట్

Read Latest AP News And Telugu News

Updated Date - Nov 13 , 2025 | 01:21 PM