Share News

Lokesh on DSC: డీఎస్సీ నోటిఫికేషన్‌‌పై లోకేష్ కీలక ప్రకటన

ABN , Publish Date - Mar 04 , 2025 | 11:36 AM

Lokesh on DSC: డీఎస్సీ నోటఫికేషన్‌పై మరో కీలక ప్రకటన చేశారు మంత్రి నారా లోకేష్. ఎట్టిపరిస్థితుల్లోనూ డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తామని మంత్రి స్పష్టం చేశారు.

Lokesh on DSC: డీఎస్సీ నోటిఫికేషన్‌‌పై లోకేష్ కీలక ప్రకటన
Minister Nara lokesh

అమరావతి, మార్చి 4: డీఎస్సీ నోటిఫికేషన్‌పై మంత్రి నారా లోకేష్ (Minister Nara lokesh) కీలక ప్రకటన చేశారు. మంగళవారం ఉదయం ఐదవ రోజు ఏపీ శాసనమండలి సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ప్రశ్నోత్తరాల సమయంలో డీఎస్సీ‌పై సభ్యులు అడిగిన ప్రశ్నకు మంత్రి లోకేష్ సమాధానం ఇచ్చారు. ఎట్టిపరిస్థితుల్లో మార్చి నెలలో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు స్పష్టం చేశారు. గత టీడీపీ ప్రభుత్వంలోనే ఉపాధ్యాయ నియామకాలు చేపట్టామని గుర్తు చేశారు.


lokesh-mandali.jpg

తిరిగి ఈ ప్రభుత్వంలో ఉపాధ్యాయ భర్తీ ప్రక్రియ జరుగుతుందని వెల్లడించారు. వర్గీకరణపై త్వరలోనే వన్ మ్యాన్ కమిషన్ నివేదిక ఇవ్వనుందని చెప్పారు. వైసీపీ హయాంలో ఒక్క టీచర్ పోస్టునూ భర్తీ చేయలేదని విమర్శించారు. టీడీపీ పాలనలోనే 70 శాతం ఉపాధ్యాయ నియామకాలు జరిగాయని మండలిలో మంత్రి లోకేష్ సమాధానం ఇచ్చారు.

Hall ticket issue: విద్యార్థుల జీవితాలతో ఆటలాడుతున్న కాలేజ్.. ఏం జరిగిందంటే


విద్యుత్ చార్జీల పెంపుపై మంత్రి గొట్టిపాటి స్పష్టత

gottipati-ravikumar-ministe.jpg

అలాగే.. మండలిలలో ప్రశ్నోత్తరాలు కొనసాగుతున్నారు. ఇందులో భాగంగా విద్యుత్ చార్జీలపై పెంపుకు సంబంధించి శాసనమండలిలో ఆ శాఖా మంత్రి గొట్టిపాటి రవి కుమార్ స్పష్టతనిచ్చారు. కూటమి ప్రభుత్వం విద్యుత్ చార్జీలను పెంచలేదని.. పెంచబోదని తేల్చిచెప్పారు. విద్యుత్ చార్జీల పెంపు పాపం జగన్ మోహన్ రెడ్డిదే అని మండిపడ్డారు. విద్యుత్ చార్జీల పెంపుపై వైసీపీ ఆరోపణలు సత్యదూరమైనవన్నారు. విద్యుత్ చార్జీల పెంపుపై ప్రజలను వైసీపీ నాయకులు తప్పుదోవ పట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు 9 సార్లు విద్యుత్ చార్జీలను పెంచారని గుర్తుచేశారు. విద్యుత్ చార్జీలను వాళ్లే పెంచి, వాళ్లే ధర్నాలు చేసి, వాళ్లే ప్రశ్నలు అడుగడం ఒక వింత పరిస్థితి అంటూ వ్యాఖ్యలు చేశారు.


పీపీఏలను రద్దు చేసి, పెట్టుబడిదారులను బెదిరించి, భయపెట్టింది వైసీపీ నాయకులే అని తెలిపారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఒక్క మెగావాట్ విద్యుత్ అధికంగా ఉత్పత్తి చేయలేదన్నారు. విద్యుత్ సంస్థల డబ్బును బేవరేజ్ కార్పోరేషన్‌కు మళ్లించారన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత 65 శాతం విద్యుత్ కొనుగోళ్లు తగ్గించామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం రాయితీలను కూడా సమర్థవంతంగా వినియోగించుకుంటూ ముందుకు వెళ్తున్నామని మంత్రి గొట్టిపాటి రవికుమార్ పేర్కొన్నారు.


వైసీపీ ఆందోళన..

కాగా.. ఐదో రోజు మండలి సమావేశాల్లో నిరుద్యోగ భృతి, ఉద్యోగ కల్పనపై వైసీపీ వాయిదా తీర్మానాన్ని ఇచ్చింది. అయితే వైసీపీ ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని చైర్మన్ తిరస్కరించారు. దీంతో వాయిదా తీర్మానంపై చర్చకు వైసీపీ సభ్యులు డిమాండ్ చేశారు. సభలో వైసీపీ ఎమ్మెల్సీలు నినాదాలు చేశారు. దీంతో కాసేపు సభలో గందరగోళ పరిస్థితి నెలకొంది.


ఇవి కూడా చదవండి...

Gold Rates Today: పసిడి కొనుగోలు చేయాలా.. నేటి రేట్లు ఎలా ఉన్నాయంటే..

Ukraine Military aid Paused: ఉక్రెయిన్ అధ్యక్షుడికి భారీ షాకిచ్చిన ట్రంప్.. మిలిటరీ సాయం నిలిపివేత

Read Latest AP News And Telugu News

Updated Date - Mar 04 , 2025 | 01:18 PM