Share News

Raghurama Vs Sajjala: సజ్జల దూషణలపై అభ్యంతరం.. డీజీపీకి రఘురామ లేఖ

ABN , Publish Date - Jun 10 , 2025 | 12:53 PM

Raghurama Vs Sajjala: ఏపీ మహిళలపై సజ్జల చేసిన వ్యాఖ్యలను డిప్యూటీ స్పీకర్ రఘురామ తీవ్రంగా తప్పుబట్టారు. సజ్జలపై డీజీపీకి ఫిర్యాదు చేస్తూ లేఖ రాశారు.

Raghurama  Vs Sajjala: సజ్జల దూషణలపై అభ్యంతరం.. డీజీపీకి రఘురామ లేఖ
Raghurama Vs Sajjala

అమరావతి, జూన్ 10: ఏపీ మహిళలను కించ పరిచే వ్యాఖ్యలు చేసిన వైసీపీ నేత సజ్జల రామకృష్ణ రెడ్డిపై (YSRCP Leader Sajjala Ramakrishna Reddy) చర్యలు తీసుకోవాలని డీజీపీకి (AP DGP) డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణం రాజు (Deputy Speaker Raghuram Raam Krishnam Raju) లేఖ చేశారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని ఫిర్యాదు చేశారు. మహిళలను సంకర జాతి అంటూ సజ్జల దూషణలను రఘురామ తీవ్రంగా తప్పుబట్టారు. కుల వివక్షకు సంబంధించిన ఈ పదం వాడటంపై భారత శిక్షాస్మృతి ప్రకారం చట్టబద్ధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. సజ్జల దూషణలు అమరావతిలో నివసిస్తున్న వేలాది మంది ప్రజల మనోభావాలను దెబ్బతీసిందని తెలిపారు.


సజ్జల రామకృష్ణ రెడ్డిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ సెక్షన్ల కింద కేసు నమోదు చేయాలని డీజీపీకి ఉపసభాపతి లేఖ రాశారు. భవిష్యత్తులో ఇటువంటి అవమానకరమైన కులతత్వ భాషను ఎవరూ ఉపయోగించకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేస్తూ సజ్జల వ్యాఖ్యలను డిప్యూటీ స్పీకర్ రఘురామ తన లేఖకు జత చేశారు.


వాళ్ల ఫోటోలను చెప్పుతో కొట్టాలి: రఘురామ

ఈ సందర్భంగా డిప్యూటీ స్పీకర్ మాట్లాడుతూ.. సజ్జల రామకృష్ణరెడ్డి దెయ్యాలు వేదాలు వల్లించినట్టు కొన్ని వేదమంత్రాలు వల్లించారని మండిపడ్డారు. అమరావతిలో మహిళలను వేశ్యలుగా అవమానించిన వ్యక్తుల ఫోటోలను చెప్పుతో కొట్టాలన్నారు. గత ప్రభుత్వం చేస్తున్న ఆగడాలను తాను ప్రశ్నించినందుకు నర్సాపురం పార్లమెంటులో అన్ని గ్రామాల్లో తన ఫోటోలను చెప్పులతో కొట్టించారని గుర్తుచేశారు. వాళ్ళకు వాళ్ళు రాక్షసులు, పిశాచాలు అనుకుంటే వారి ఇష్టమన్నారు. ‘వాళ్ళంతా పిశాచాలు, రాక్షసులు, సంకర జాతి వాళ్ళు అని నేను పోరపాటున కూడా అనడం లేదు. నా దిష్టి బొమ్మలు తగులబెట్టారు. మూత్రం కూడా పోశారు. చెప్పుకోవాలంటే బాధ అనిపిస్తుంది. ఇవి సోషల్ మీడియాలో పెట్టి చాలా ఆనందించారు. ఇది రాక్షస ఆనందం అంటారో, పిశాచ ఆనందం అంటారో. ఏదో పిల్ల వేషాలు వేశారులే పిల్ల వెధవలు అని క్షమించి వదిలేసా’ అంటూ రఘురామ కృష్ణం రాజు పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి

భారీ బందోబస్తు నడుమ కోర్టుకు కొమ్మినేని

ఇంటర్ విద్యార్థిని హత్య కేసులో సంచలన విషయాలు

Read latest AP News And Telugu News

Updated Date - Jun 10 , 2025 | 01:07 PM