Share News

May Day wishes: కార్మికులకు సీఎం చంద్రబాబు, లోకేష్ మేడే శుభాకాంక్షలు

ABN , Publish Date - May 01 , 2025 | 09:44 AM

May Day wishes: మేడేను పురస్కరించుకుని కార్మికులకు సీఎం చంద్రబాబు, లోకేష్ విషెస్ తెలియజేశారు. కార్మిక వర్గం పక్షాన నిలబడి వారికి మేలు చేయడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తోందని అన్నారు.

May Day wishes: కార్మికులకు సీఎం చంద్రబాబు, లోకేష్ మేడే శుభాకాంక్షలు
CM Chandrababu and Minister Lokesh

అమరావతి, మే 1: అంతర్జాతీయ కార్మిక దినోత్సవం (మేడే) (International May Day) సందర్భంగా కార్మిక, కర్షక సోదరులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu), మంత్రి నారా లోకేష్ (Minister Nara Lokesh) శుభాకాంక్షలు తెలిపారు. కార్మిక శక్తి లేనిదే సమాజం ముందుకు వెళ్లదని.. పెద్ద ఎత్తున ఉద్యోగ, ఉపాధి కల్పిస్తామని భరోసా ఇచ్చారు. శ్రామికులే అభివృద్ధిలో అసలైన భాగస్వాములంటూ ట్విట్టర్ వేదికగా సీఎం, మంత్రి తెలియజేశారు.


చంద్రబాబు ట్వీట్

‘ఇంటర్నేషనల్ మేడే సందర్భంగా కార్మిక సోదరులకు నా శుభాకాంక్షలు. శ్రమ దోపిడికి వ్యతిరేకంగా ఎందరో మహానుభావులు జరిపిన పోరాట ఫలితంగా కార్మిక లోకంలో చైతన్యం వెల్లివిరిసింది. ఆనాటి దోపిడి విధానాలను సమూలంగా మార్చుకుని కార్మికులు తమ హక్కులను సాధించుకున్న రోజు ఇది. కార్మిక శక్తి లేనిదే సమాజం ముందుకు వెళ్ళదు. కార్మిక, కర్షకులు అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటూ ముందుకు వెళ్లడం ప్రస్తుతం అత్యంత అవసరం. కార్మిక వర్గం పక్షాన నిలబడి వారికి మేలు చేయడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తోందని ఈ సందర్భంగా మీకు తెలియచేస్తున్నాను. నాలా చట్టం రద్దు, ఉచిత ఇసుక విధానం, భవన నిర్మాణాలకు, లే అవుట్లకు అనుమతులు సరళతరం చేయడం వంటి నిర్ణయాలతో ఇప్పటికే నిర్మాణ రంగాన్ని నిలబెట్టి లక్షల మంది జీవితాలకు భద్రత కల్పించాం. 175 నియోజకవర్గాల్లో ఎంఎస్ఎంఈ పార్కులు, అన్ని ప్రాంతాల్లో పరిశ్రమల ఏర్పాటుతో పెద్ద ఎత్తున ఉద్యోగ, ఉపాధి అవకాశాలు సృష్టిస్తాం. కూటమి ప్రభుత్వం కార్మికుల ప్రభుత్వంగా, కష్టజీవుల ప్రభుత్వంగా ఉంటుందని మీకు తెలియజేస్తున్నాను. మరొక్క మారు అందరికీ మేడే శుభాకాంక్షలు’ అంటూ సీఎం ట్వీట్ చేశారు.

YS Jagan: అమరావతి రీ లాంచ్ పనులు.. వైఎస్ జగన్‌కు ఆహ్వానం


అండగా నిలుస్తాం: లోకేష్

మేడే సందర్భంగా కార్మికులకు మంత్రి లోకేష్ ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలియజేశారు. ‘కార్మికులు తమ హక్కుల కోసం రక్తం చిందించి పోరాడి సాధించిన రోజే మే డే. శ్రామికులే అభివృద్ధిలో అసలైన భాగస్వాములు. కూటమి ప్రభుత్వ పాలనలో కార్మికులు, కర్షకుల అభ్యున్నతికి కృషిచేస్తున్నాం. వారికి అన్ని విధాల అండగా నిలుస్తున్నాం. కార్మిక సోదర, సోదరీమణులకు అంతర్జాతీయ కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు’ అంటూ మంత్రి లోకేష్ పోస్టు పెట్టారు.


ఇవి కూడా చదవండి

కొనుగోళ్లలో అదే జోరు!

CM Revanth Reddy: కార్మికలోకానికి ‘మే’డే శుభాకాంక్షలు

Read Latest AP News And Telugu News

Updated Date - May 01 , 2025 | 11:46 AM