Good News: పాస్టర్లకు సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్..
ABN , Publish Date - Apr 18 , 2025 | 08:04 AM
క్రైస్తవ సోదరులు గుడ్ ఫ్రైడేను జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా పాస్టర్లకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుభవార్త చెప్పారు. వారికి ప్రతి నెల రూ. 5 వేలు చొప్పున గౌరవ వేతనం ఇవ్వాలని నిర్ణయించారు. దీంతో రాష్ట్రంలో 8 వేల మందికిపైగా పాస్టర్లకు లబ్ది చేకూరనుంది.

అమరావతి: క్రైస్తవ సోదరులు (Christian Brothers) గుడ్ ఫ్రైడే (Good Friday)ను భక్తి శ్రద్దలతో జరుపుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu) పాస్టర్లకు (Pastors) గుడ్ న్యూస్ (Good News) చెప్పారు. పాస్టర్లకు నెలకు రూ. 5 వేలు చొప్పున గౌరవ వేతనం ఇవ్వాలని సీఎం నిర్ణయించారు. దీంతో రాష్ట్రంలోని 8,427 మంది పాస్టర్లకు నెలకు రూ. 5 వేలు చొప్పున గౌరవ వేతనం విడుదల చేసేందుకు సీఎం చంద్రబాబు అధికారులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. 2024, మే నుంచి నవంబర్ వరకు ఈ గౌరవ వేతనం విడుదల చేయనున్నారు. ఈ ఏడు నెలల కాలానికిగాను రూ. 30 కోట్లు కూటమి ప్రభుత్వం విడుదల చేసింది. ఈ ఏడు నెలలకు ఒకొక్క పాస్టర్‌కు రూ. 35 వేల చొప్పున లబ్ది చేకూరనుంది.
Also Read..: అమెరికాలో మరోసారి కాల్పులు.. ఇద్దరి మృతి
కాగా 2023 జనవరిలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పేరిట పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా పాస్టర్లతో ఆయన ఆత్మీయ సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ అధికారంలోకి వస్తే.. గౌరవ వేతనం అందిస్తామని పాస్టర్లకు ఆయన హామీ ఇచ్చారు. ఆ క్రమంలో అధికారంలోకి వచ్చాక ఇచ్చిన మాట ప్రకారం ప్రభుత్వం హామీని అమలు చేసింది.
2024 మే, జూన్ మాసాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో బీజేపీ, టీడీపీ, జనసేన కూటమిగా ఏర్పడి బరిలో నిలిచాయి. దీంతో ఆంధ్రప్రదేశ్ ఓటరు ఈ కూటమికి పట్టం కట్టాడు. దీంతో చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం కొలువు తీరింది. ఈ ప్రభుత్వం అధికారం చేపట్టిన అనంతరం ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇచ్చిన హామీలను వరుసగా అమలు చేసుకొంటు వస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే కూటమి ప్రభుత్వం పలు హామీలను అమలు చేసింది. మరికొన్ని హామీలు అమలు చేయాల్సి ఉంది. మరోవైపు.. గత జగన్ ప్రభుత్వం సంక్షేమం పేరుతో పలు పథకాల రూపంలో ప్రజలకు లబ్ది చేకూర్చింది. దీంతో ఖజానా పూర్తిగా ఖాళీ అయింది. దీంతో ఎన్నికల వేళ ఇచ్చిన హామీలు.. అమల్లో కొంత ఆలస్యం అవుతున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పటికే పలు పథకాలను సీఎం చంద్రబాబు ప్రారంభించి అమలు చేస్తూ వస్తున్న విషయం విధితమే.
పవిత్రమైన రోజు గుడ్ ఫ్రైడే.. మంత్రి లోకేష్
మానవాళిని పాపాల నుంచి విముక్తం చేయడానికి శిలువ ఎక్కారు ప్రభువైన యేసుక్రీస్తు. తన రక్తాన్ని చిందించి మనుషుల పాపాలనూ, దోషాలనూ ప్రక్షాళన చేశారని.. శాంతి, క్షమల సందేశాన్ని తన త్యాగంతో యేసుక్రీస్తు చాటిచెప్పిన పవిత్రమైన రోజే గుడ్ ఫ్రైడే అని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ సోషల్ మీడియా ట్విట్టర్ వేదికగా పోస్టు చేశారు.
ప్రజలకు గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు.. హోం మంత్రి
ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత ప్రజలందరికీ గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు తెలియజేశారు. సమస్త మానవాళి పట్ల ప్రేమ, నిస్సహాయులపట్ల కరుణ, శత్రువుల పట్ల క్షమ, ఆకాశమంతటి సహనం, అవధులు లేని త్యాగం.. ఈ ప్రపంచానికి జీసస్ ఇచ్చిన పవిత్ర సందేశాన్ని ప్రతి ఒక్కరూ ఆచరించాలని కోరుకుంటూ హోమంత్రి మరోసారి ప్రజలందరికీ గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి..
11 ఏళ్ల బాలికను అత్యంత దారుణంగా..
జగన్ అక్రమాస్తుల కేసులో దాల్మియా సిమెంట్ ఆస్తులు జప్తు
For More AP News and Telugu News