Home » Kutami
CM Chandrababu: ప్రజలకు ఇచ్చిన 94 శాతం స్ట్రైక్ రేట్‌ను కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉందని, ప్రజల్లో తృప్తి చూస్తూ భవిష్యత్తుపై భరోసా కల్పించాల్సిన బాధ్యత నాయకులపై ఎక్కువగా ఉంటుందని సీఎం చంద్రబాబు నేతలను ఉద్దేశించి అన్నారు.
CM Chandrababu: 2019 ఎన్నికల్లో మళ్లీ టీడీపీ గెలిచి ఉంటే.. రాష్ట్రం అభివృద్ధిలో అగ్రభాగాన ఉండేదని సీఎం చంద్రబాబు అభిప్రాయం వ్యక్తం చేశారు. డబ్బులతోనే గెలుపు సాధ్యం కాదని, ఎన్నికల్లో మనకంటే ఎక్కువ ఖర్చు పెట్టినవాళ్లకు.. కేవలం 11 సీట్లే వచ్చాయని అన్నారు.
Key Meeting: సీఎం చంద్రబాబు అధ్యక్షతన పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆదివారం ఉదయం విస్తృత స్థాయి సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ కన్వీనర్లు అందరూ హాజరవుతున్నారు.
Kutami Leaders: ఏపీలో సీఎం చంద్రబాబు ఆధ్వర్యంలో సుపరిపాలన 4 ఏళ్ళు కొనసాగాలని కూటమి నేతలు ఆకాంక్షించారు. కూటమి ప్రభుత్వంపై ప్రజలు పెట్టుకున్న నమ్మకం వమ్ము చేయమని, కూటమి రాష్ట్రంలో 30 ఏళ్లు పరిపాలిస్తుందని నేతలు అభిప్రాయం వ్యక్తం చేశారు.
TDP vs YCP: 2019 నుంచి 2024 వరకు వైసీపీ పాలనను ఓర్పుతో భరించిన ప్రజలు 2024 అసెంబ్లీ ఎన్నికల్లో ఓటుతో వైసీపీకి బుద్ధి చెప్పారు. వైసీపీని ఓడించడమనే ఏకైక లక్ష్యంతో పోలింగ్ కేంద్రాలకు పోటెత్తారు. ప్రజల్లో నిగూఢంగా దాగున్న వ్యతిరేకత బద్దలైంది. అది 2024 జూన్ 4న ఎన్నికల ఫలితాల రోజున వెల్లడైంది.
AP News: కడప ఎమ్మెల్యే మాధవి రెడ్డి.. వైసీపీ మేయర్ సురేష్ బాబుల మధ్య గత కొంత కాలంగా కుర్చీ వివాదం నడుస్తున్న విషయం తెలిసిందే. సురేశ్ బాబు పదవి పోవడానికి ఈ వివాదమే కారణమని కడప ప్రజలు చర్చించుకుంటున్నారు.
క్రైస్తవ సోదరులు గుడ్ ఫ్రైడేను జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా పాస్టర్లకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుభవార్త చెప్పారు. వారికి ప్రతి నెల రూ. 5 వేలు చొప్పున గౌరవ వేతనం ఇవ్వాలని నిర్ణయించారు. దీంతో రాష్ట్రంలో 8 వేల మందికిపైగా పాస్టర్లకు లబ్ది చేకూరనుంది.
సమైక్యాంధ్ర ఉద్యమ సమయంలో ఏపీఎస్ఆర్టీసీ నర్సీపట్నం డిపోలో కాంట్రాక్ట్ కార్మికుడిగా పనిచేస్తూ తన భర్త మరణించాడని, కాంట్రాక్ట్ కార్మికుల కుటుంబాలకు బ్రెడ్ విన్నర్ స్కీమ్ వర్తింపజేస్తామని 2013లో యూనియన్‌తో జరిగిన అగ్రిమెంట్ అమలు చేయకపోవడంతో తమ కుటుంబం రోడ్డున పడిందని విశాఖకు చెందిన కె.రమాదేవి మంత్రి నారా లోకేష్‌ను కలిసి ఆవేదన వ్యక్తం చేశారు.
పట్టణ ప్రాంతాల్లో బుక్ చేసిన 24 గంటల లోపు.. గ్రామీణ ప్రాంతాల్లో అయితే 48 గంటల లోపు గ్యాస్ డెలివరీ చేస్తారని మంత్రి నాడేండ్ల అన్నారు.ఆ తర్వాత సిలెండర్ డెలివరీ అయిన 48 గంటల్లోపు చెల్లించిన పూర్తి సొమ్మును లబ్దిదారుల ఖాతాల్లో తిరిగి జమ అవుతుందన్నారు. ఒక సంవత్సరంలో 3 గ్యాస్ సిలిండర్లు ఇలా ఉచితంగా పంపిణీ చేస్తామన్నారు.
రాష్ట్రంలోని వివిధ విద్యాసంస్థల్లో ఉన్నత విద్య, వృత్తి విద్య అభ్యసిస్తున్న విద్యార్థుల్లో ఐటీ, అడ్వాన్స్డ్ టెక్నాలజీ నైపుణ్యాలను పెంపొందించేందుకు ప్రఖ్యాత ఐటీ సంస్థ సిస్కో, ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మధ్య ఒప్పందం కుదిరింది. మంత్రి నారా లోకేశ్ సమక్షంలో ఎంవోయూ జరిగింది.