AP News: జగన్ రెడ్డికి కూటమి ప్రభుత్వం ఝలక్.. ఎందుకంటే..
ABN , Publish Date - May 15 , 2025 | 08:50 AM
AP News: కడప ఎమ్మెల్యే మాధవి రెడ్డి.. వైసీపీ మేయర్ సురేష్ బాబుల మధ్య గత కొంత కాలంగా కుర్చీ వివాదం నడుస్తున్న విషయం తెలిసిందే. సురేశ్ బాబు పదవి పోవడానికి ఈ వివాదమే కారణమని కడప ప్రజలు చర్చించుకుంటున్నారు.

కడప జిల్లా : వైసీపీ అధ్యక్షుడు (YCP Chief), మాజీ సీఎం (Ex CM) జగన్ రెడ్డి (Jagan Reddy)కి కూటమి ప్రభుత్వం (Alliance Government) ఝలక్ ఇచ్చింది. కడప నగర వైసీపీ మేయర్ సురేష్ బాబుపై అనర్హత వేటు వేసింది. మేయర్ (Mayor) పదవి నుంచి సురేష్ బాబు (Suresh Babu)ను తొలగిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. నిబంధనలకు విరుద్ధంగా మేయర్ సురేష్ బాబు కుటుంబ సభ్యులు కడపలో కాంట్రాక్టు పనులు చేశారని విజిలెన్స్ అధికారులు విచారణలో తేల్చారు. దీంతో కూటమి ప్రభుత్వం ఆయనపై వేటు వేసింది.
Also Read: సామర్లకోట మున్సిపల్ చైర్‌పర్సన్‌పై అవిశ్వాసం
కడప ఎమ్మెల్యే మాధవి రెడ్డి.. వైసీపీ మేయర్ సురేష్ బాబుల మధ్య గత కొంత కాలంగా కుర్చీ వివాదం నడుస్తున్న విషయం తెలిసిందే. సురేశ్ బాబు పదవి పోవడానికి ఈ వివాదమే కారణమని కడప ప్రజలు చర్చించుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే సమావేశంలో కుర్చీ లేకుండా నన్ను అవమానిస్తావా.. నీకు ఆ కుర్చీనే లేకుండా చేస్తానని సురేష్ బాబుపై ఎమ్మెల్యే మాధవి రెడ్డి శపథం చేశారు.
కాగా కడప మేయర్ సురేష్ బాబుపై పలు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో ఆ పదవి నుంచి ఆయన్ని తొలగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మున్సిపల్ చట్టాన్ని ఉల్లంఘించిన అంశంలో సురేష్ బాబుపై అనర్హత వేటు వేసినట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. కుటుంబ సభ్యులకు కాంట్రాక్టు పనులు అప్పగించిన అంశంలో మేయర్ సురేష్ బాబుపై ప్రభుత్వానికి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో మేయర్ సురేష్ బాబును మున్సిపల్ ప్రిన్సిపల్ సెక్రటరీ సురేశ్ కుమార్ అమరావతిలో విచారించారు. అయితే తనకు రెండు వారాల గడువు కావాలని మేయర్ కోరారు. మేయర్ వివరణపై ప్రభుత్వం సంతృప్తి చెందలేదు. దీంతో ఆయనను మేయర్ పదవి నుంచి తొలగిస్తూ.. ఉత్తర్వులు జారీ చేశారు.
మరోవైపు అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఓటమి పాలు కావడంతో.. ఆ పార్టీకి దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. ఇప్పటికే పలువురు అగ్రనేతలు ఆ పార్టీని వీడారు. తాజాగా బుధవారం వైసీపీ ఎమ్మెల్సీ జాకీయా ఖానమ్.. తన పదవికి రాజీనామా చేశారు. ఆమె మండలిలో డిప్యూటీ చైర్ పర్సన్‌గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. అయితే జాకీయా ఖానమ్.. తన ఎమ్మెల్సీ పదవికి అకస్మాత్తుగా రాజీనామా చేయడంతో పార్టీలో కలకలం రేగింది.
ఈ వార్తలు కూడా చదవండి..
బెజవాడ కనకదుర్గమ్మకు అగ్గిపెట్టెలో పట్టే పట్టు చీర బహుకరణ
ట్రంప్ వ్యాఖ్యలపై ప్రధాని సమాధానం చెప్పాలి
శ్రీనివాస గోవిందా పాట తొలగించకుంటే
For More AP News and Telugu News