Share News

CM Chandrababu: జర్నలిస్టు ప్రసాద్ మృతి పట్ల సీఎం చంద్రబాబు సంతాపం

ABN , Publish Date - Jan 15 , 2025 | 09:34 AM

CM Chandrababu: జర్నలిస్టు గోశాల ప్రసాద్ మృతిపట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంతాపం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వ విధ్వంస పాలనపై ధైర్యంగా గళమెత్తి అన్ని వర్గాల మన్ననలు పొందారని తెలిపారు. రాజకీయ పరిణామాలపై టీవీ చర్చల్లో లోతైన విశ్లేషణతో ప్రజాపక్షాన పనిచేశారని.. తనదైన ముద్ర వేశారని అన్నారు.

CM Chandrababu: జర్నలిస్టు ప్రసాద్ మృతి పట్ల సీఎం చంద్రబాబు సంతాపం
CM Chandrababu Naidu

అమరావతి, జనవరి 15: జర్నలిస్టు, రాజకీయ విశ్లేషకులు గోశాల ప్రసాద్ (Journalist Goshala Prasad) మృతిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నాలుగు దశాబ్దాలు జర్నలిస్టుగా, రాజకీయ విశ్లేషకునిగా ప్రసాద్ ఎంతో పేరు తెచ్చుకున్నారన్నారు. గత ప్రభుత్వ విధ్వంస పాలనపై ధైర్యంగా గళమెత్తి అన్ని వర్గాల మన్ననలు పొందారని తెలిపారు. రాజకీయ పరిణామాలపై టీవీ చర్చల్లో లోతైన విశ్లేషణతో ప్రజాపక్షాన పనిచేశారని.. తనదైన ముద్ర వేశారని అన్నారు. నిత్యం తన విశ్లేషణలతో, రాతలతో సమాజ హితం కోసం పనిచేసిన ప్రసాద్ మృతి తీవ్ర విచారం కలిగించిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించిన ముఖ్యమంత్రి చంద్రబాబు... వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.


మంత్రి పార్ధసారథి సంతాపం..

parthasarathi.jpg

సీనియర్ జర్నలిస్ట్, దేవాదాయ ధర్మదాయ శాఖ ఆధ్వర్యంలో వెలువడుతున్న ఆరాధన పత్రిక సంపాడుకులు గోశాల ప్రసాద్ మరణం పట్ల రాష్ట్ర గృహనిర్మాణం, సమాచార పౌరసంబందాల శాఖ మంత్రి కొలుసు పార్ధ సారధి తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ఆంధ్రప్రభ దినపత్రికలో జర్నలిస్టుగా సుధీర్ఘకాలం పని చేసి వివధ మీడియా సంస్థలు, ఛానల్‌లలో విశ్లేషకుడిగా పనిచేసిన అపారమైన అనుభవం గల జర్నలిస్ట్ ప్రసాద్ అని కొనియాడారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడుని కోరుకుంటూ ఆయన కుటుంభసభ్యులకు మంత్రి పార్ధసారథి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

.


ప్రసాద్ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలి: లోకేష్

సీనియర్ పాత్రికేయులు, రాజకీయ విశ్లేషకులు గోశాల ప్రసాద్ మృతిపట్ల విద్య , ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ సంతాపం తెలియజేశారు. వారి మృతి దిగ్భ్రాంతికి గురిచేసిందన్నారు. నాలుగు దశాబ్దాలుగా వివిధ దినపత్రికల్లో పనిచేసిన ప్రసాద్ అందరికీ సుపరిచితులన్నారు. టీవీ చర్చా కార్యక్రమాల్లో పాల్గొని తనదైన విశ్లేషణలతో గత ప్రభుత్వ విధ్వంస విధానాలను తీవ్రంగా నిరసించారని తెలిపారు. ప్రజల పక్షాన నిలిచి వారి అభ్యున్నతికి కృషిచేశారన్నారు. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని.. కుటుంబ సభ్యులకు లోకేష్ ప్రగాఢ సానుభూతిని తెలిపారు.


నమ్మలేకపోయా: బాలకోటయ్య

అమరావతి: జర్నలిస్టు గోశోల ప్రసాద్ గారి మరణం గూర్చి వాట్సాప్ గ్రూపుల్లో చూసి మొదట నమ్మలేకపోయానని పోతుల అమరావతి బహుజన ఐకాస అధ్యక్షులు బాలకోటయ్య అన్నారు. ఆయన మృతి పట్ల విచారించి దిగ్భ్రాంతికి లోనయ్యానన్నారు. గత ఐదేళ్ళ పోరాటంలో ఏబీఎన్ డిబేట్‌లలో పక్క పక్కన కూర్చొని మాట్లాడిన సందర్భాలు ఎన్నో ఉన్నాయని గుర్తుచేసుకున్నారు. ‘‘నాకు మంచి జరగాలని, కొత్త ప్రభుత్వం రాగానే మంచి భవిష్యత్తులో నన్ను చూడాలని మనసారా కోరుకున్న ప్రముఖుల్లో ప్రసాద్ చాలా ముఖ్యులు’’ అని తెలిపారు. ప్రసాద్‌కు కూడా మంచి అవకాశం వస్తోందని తాను కాంక్షించానని.. ఇలా ఆయన కోరిక తీరకుండానే అనంత తీరాలకు వెళ్ళటం జీర్ణించుకోలేక పోతున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడిని ప్రార్థిస్తూ.. ప్రసాద్ కుటుంబసభ్యులకు బాలకోటయ్య ప్రగాఢ సానుభూతిని తెలిపారు.


ఇవి కూడా చదవండి...

సంక్రాంతికి హరిదాసులు ఎందుకు వస్తారంటే..

సీఎం చంద్రబాబు నిర్ణయంతో కౌలు రైతుల హర్షం..

Read Latest AP News And Telugu News

Updated Date - Jan 15 , 2025 | 10:33 AM