Share News

CM Congrats Ashok Gajapathi: గవర్నర్ పదవికి అశోక్ గజపతిరాజు వన్నె తేవాలి: సీఎం, లోకేష్

ABN , Publish Date - Jul 14 , 2025 | 03:59 PM

CM Chandrababu Congrats Ashok Gajapathi: మాజీ కేంద్రమంత్రి అశోక్ గజపతి రాజు గోవా గవర్నర్‌గా నియమితులైనందుకు సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ అభినందనలు తెలియజేశారు. గోవా గవర్నర్‌గా ఆ పదవికి వన్నె తేవాలని ఆకాంక్షించారు.

CM Congrats Ashok Gajapathi: గవర్నర్ పదవికి అశోక్ గజపతిరాజు వన్నె తేవాలి: సీఎం, లోకేష్
CM Chandrababu Congrats Ashok Gajapathi:

అమరావతి, జులై 14: గోవా గవర్నర్‌గా అశోక్ గజపతి రాజును (Ashok Gajapathi Raju) నియమించడం పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu), మంత్రి నారా లోకేష్ (Minister Nara Lokesh) హర్షం వ్యక్తం చేశారు. ఇది రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన గౌరవం అని అభిప్రాయపడ్డారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (President Draupadi Murmu), ప్రధాని నరేంద్ర మోదీకి (PM Narendra Modi), కేంద్ర మంత్రివర్గానికి కృతజ్ఙతలు తెలియజేశారు. అశోక్ గజపతిరాజు గోవా గవర్నర్‌గా ఆ పదవికి వన్నె తేవాలి అని సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ ఆకాంక్షించారు. సోషల్ మీడియా ఎక్స్ వేదికగా అశోక్ గజపతిరాజుకు సీఎం, మంత్రి విషెస్ తెలియజేశారు.


చంద్రబాబు ట్వీట్

‘గోవా గవర్నర్‌గా నియమితులైన అశోక్ గజపతిరాజుకు అభినందనలు. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజలకు దక్కిన గౌరవం. ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు కృతజ్ఞతలు. గవర్నర్‌గా తన విధుల నిర్వహణలో అశోక్ గజపతి రాజు విజయం సాధిస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను’ అంటూ సీఎం చంద్రబాబు ట్వీట్ చేశారు.


లోకేష్ విషెస్

గోవా గవర్నర్‌గా అశోక్ గజపతి రాజును నియమించడం పట్ల మంత్రి నారా లోకేష్ హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధానికి కృతజ్ఙతలు తెలియజేశారు. అశోక్ గజపతిరాజుకు ఉన్న నీతి, నిజాయితీ, నిబద్ధత, అంకితభావం, ప్రజల కోసం పరితపించే గుణం గవర్నర్ పదవికి మరింత గౌరవం తెచ్చిపెడతాయని లోకేష్ ట్వీట్ చేశారు.


అలాగే అశోక్ గజపతిరాజు‌కు ఏపీ బీజేపీ అధ్యక్షులు పీవీఎన్ మాధవ్ హార్దిక శుభాకాంక్షలు తెలియజేశారు. పార్టీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు కూడా అశోక్ గజపతిరాజుకు ఫోన్ చేసి అభినందించారు. పార్టీ పట్ల అంకితభావం, ప్రజాసేవలో నిబద్ధత ఉన్న నేతకు గౌరవం దక్కిందని యనమల రామకృష్ణుడు ప్రశంసించారు.


ఇవి కూడా చదవండి

ఆస్తి తగాదా.. యువకుడి హైడ్రామా.. చివరకు ఏమైందంటే

ఆ మూడు ఘటనలు జగన్ కుతంత్రాల్లో భాగమే: దేవినేని

Read Latest AP News And Telugu News

Updated Date - Jul 14 , 2025 | 04:34 PM