Inter Results: ఏపీలో ప్రయోగాత్మకంగా ఇంటర్ ఫలితాలు..
ABN , Publish Date - Apr 12 , 2025 | 10:10 AM
ఏపీలో శనివారం ఉదయం 11 గంటలకు ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలు విడుదల కానున్నాయి. అయితే ఈసారి ప్రభుత్వం వినూత్నంగా ఇంటర్ ఫలితాలు విడుదల చేస్తోంది. వాట్సాప్ గవర్నెన్స్‌లో హాయ్ అని చెప్పడం ద్వారా విద్యార్థులు ఫలితాలు చూసుకోవచ్చు. ఫలితాలను తెలుసుకునేందుకు హాల్ టికెట్ నెంబర్ , డేట్ అఫ్ బర్త్ ఉంటే చాలు.

అమరావతి: ఏపీ (AP)లో శనివారం ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలు విడుదల (Intermediate exam results release) కానున్నాయి. అయితే ఈసారి ప్రభుత్వం వినూత్నంగా (Innovatively)ఇంటర్, మొదటి, ద్వితీయ సంవత్సర పరీక్ష ఫలితాలు విడుదల చేస్తోంది. వాట్సాప్ గవర్నెన్స్(WhatsApp governance)లో హాయ్ (hi) అని చెప్పడం ద్వారా విద్యార్థులు ఫలితాలు చూసుకోవచ్చు. గతంలో ప్రభుత్వాలు పరీక్షా ఫలితాల విడుదల సందర్భంగా మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లోనూ ఫలితాలు విడుదల చేసేవి. ఈసారి రొటీన్‌కు భిన్నంగా శనివారం ఉదయం 11 గంటలకు బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ వెబ్‌సైట్‌లో http://resultsbie.ap.gov.in ఫలితాలు ఉంచుతామని ప్రభుత్వం వెల్లడించింది. ఏపీ ప్రభుత్వం ప్రయోగాత్మకంగా ప్రారంభించిన వాట్సాప్ గవర్నెన్స్‌లో విద్యార్థులు ఇంటర్ ఫలితాలు చూసుకోవచ్చు. ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కోరుతున్నారు. వాట్సాప్ గవర్నెన్స్ లో మనమిత్ర చాట్‌లో హాయ్ అని మెసేజ్ చేస్తే చాలు క్షణాల్లో ఫలితాలు కళ్ళముందు కనిపించేటట్లు ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఫలితాలను తెలుసుకునేందుకు హాల్ టికెట్ నెంబర్ , డేట్ అఫ్ బర్త్ ఉంటే చాలు. మన మిత్ర వాట్స్ యాప్ నంబర్‌కు 9552300009లో ‘hi’ అని కొట్టి కూడా ఫలితాలు తెలుసుకోవచ్చునని మంత్రి లోకేష్ చెప్పారు. అందరికి మంచి ఫలితాలు రావాలని కోరుకుంటూ లోకేష్ బెస్ట్ విషెస్ చెప్పారు.
Also Read..: KCR: ఒక ప్రపంచ పర్యావరణ వేత్తను కోల్పోయాం...
కాగా ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు శనివారం (మార్చి1న) ప్రారంభం మయ్యాయి. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు నిర్వహించారు. తొలిరోజు మొదటి సంవత్సరం విద్యార్థులకు ద్వితీయ భాషపై పరీక్ష నిర్వహించారు. ఇంటర్మీడియట్ రెండు సంవత్సరాల విద్యార్థులకు రోజు తర్వాత రోజు పరీక్షలు జరిగాయి. ఈ క్రమంలో అధికారులు రాష్ట్రవ్యాప్తంగా 1,535 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. 10.58 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. అన్ని పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమేరాలు ఏర్పాటు చేసి ఆన్‌లైన్‌లో ఉన్నతాధికారుల కార్యాలయాలకు అనుసంధానం చేశారు. పరీక్షా కేంద్రాలను ‘నో మొబైల్ జోన్’గా ప్రకటించారు. మార్చి 20వ తేదీ వరకు పరీక్షలు జరిగాయి.
ఇప్పటికే ఇంటర్ పరీక్షల మూల్యాంకనం వేగంగా కొనసాంది. ఏప్రిల్ 6 నాటికి మూల్యాంకనం పూర్తి చేశారు. ఆ తర్వాత ఫలితాలను కంప్యూటరీకరణ చేసేందుకు 5-6 రోజుల సమయం పట్టింది. ఈ సంవత్సరం టెన్త్, ఇంటర్ హాల్‌టికెట్లు విడుదల చేసినట్టుగానే వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ఫలితాలు కూడా విడుదల చేసేందుకు సన్నాహాలు చేశారు. అధికారులు. వాట్సాప్ నంబర్ 9552300009 లేదా BIEAP అధికారిక వెబ్‌సైట్ ‘resultsbie.ap.gov.in’ ద్వారా విద్యార్థులు తమ ఫలితాలను చూసుకోవచ్చు.
తెలంగాణలో ఇంటర్ రిజల్ట్స్ ఎప్పుడంటే..
తెలంగాణలో ఇంటర్ పరీక్షలు మార్చి 5న మొదలై 25వ తేదీతో ముగిసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం మూల్యాంకన ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. ఏప్రిల్ చివరి వారంలో ఫలితాలు విడుదల చేయనున్నట్లు తెలంగాణ రాష్ట్ర ఇంటర్మీడియట్ విద్యా మండలి (TSBIE) అధికారిక వర్గాల సమాచారం. ఫలితాల కోసం tgbie.cgg.gov.inలో చెక్ చేసుకోవచ్చు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఒంటిమిట్ట కోదండరాముని కల్యాణం..
శోభాయమానంగా హనుమాన్ జయంతి వేడుకలు
For More AP News and Telugu News