Pawan On Chevella Bus Accident: చేవెళ్ల బస్సు ప్రమాదంపై ఏపీ డిప్యూటీ సీఎం దిగ్భ్రాంతి
ABN , Publish Date - Nov 03 , 2025 | 09:50 AM
ఆర్టీసీ బస్సును కంకర లారీ ఢీకొనడంతో 17 మంది మృతి చెందారని తెలిసి తీవ్ర దిగ్భ్రాంతికి లోనైట్లు ఏపీ డిప్యూటీ సీఎం తెలిపారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
అమరావతి, నవంబర్ 3: తెలంగాణ రాష్ట్రంలోని చేవెళ్ల వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Deputy CM Pawan Kalyan) స్పందించారు. ఆర్టీసీ బస్సును కంకర లారీ ఢీకొనడంతో 17 మంది మృతి చెందారని తెలిసి తీవ్ర దిగ్భ్రాంతికి లోనైనట్లు తెలిపారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నట్లు ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.
కాగా.. తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం ఖానాపూర్ గేటు వద్ద ఈరోజు (సోమవారం) ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 17 మంది మృతి చెందారు. ఆర్టీసీ బస్సును, టిప్పర్ ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో బస్సులో 70 మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్, టిప్పర్ డ్రైవర్ ఇద్దరూ చనిపోయారు. కంకర లోడ్‌తో ఉన్న లారీ బస్సులోకి చోచ్చుకుపోయింది. దీంతో ప్రయాణికులు సీట్లలో ఇరుక్కుపోయారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాలను వెలికి తీస్తున్నారు. గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రులకు తరలించి చికిత్స అందజేస్తున్నారు. ఈ ప్రమాదంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు. ఘటనా స్థలిలో సహాయక చర్యలు అందించాల్సిందిగా అధికారులను ఆదేశించారు. గాయపడిన వారిని మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌కు పంపించాల్సిందిగా సీఎం ఆదేశాలు జారీ చేశారు.
ఇవి కూడా చదవండి...
మంత్రాల నెపంతో పట్టపగలే మృతదేహాన్ని వెలికితీసేందుకు యత్నం.. చివరికి..
జోగి రమేష్ కుమారుడుపై కేసు నమోదుకు రంగం సిద్ధం..
Read Latest AP News And Telugu News