ఢిల్లీ పర్యటనకు సీఎం చంద్రబాబు..
ABN , Publish Date - Apr 25 , 2025 | 12:51 PM
ఏపీ రాజధాని అమరావతిలో నిర్మాణ పనులను మే2న ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. అమరావతి, ఏపీకి సంబంధించిన పలు అంశాలపై సీఎం చంద్రబాబు.. మోదీతో మాట్లాడనున్నారు. శుక్రవారం రాత్రికి ఢిల్లీలోనే చంద్రబాబు బస చేస్తారు. శనివారం ఉదయం సీఎం చంద్రబాబు ఢిల్లీ నుంచి బయలుదేరి విశాఖపట్టణానికి చేరుకుంటారు.

అమరావతి: ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) శుక్రవారం సాయంత్రం ఢిల్లీ పర్యటనకు (Delhi Visit) వెళ్లనున్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీని (PM Modi కలవనున్నారు. ఏపీ (AP)కి రావాల్సిందిగా మోదీని ఆహ్వానించనున్నారు. మే 2వ (May 2nd) తేదీన ఏపీలో ప్రధాని మోదీ పర్యటించనున్న నేపథ్యంలో చంద్రబాబు.. ప్రధానితో భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ సమావేశంలో ఏపీ పర్యటనకు సంబంధించిన విషయాల గురించి సీఎం చంద్రబాబు మోదీతో చర్చించనున్నారు.
Also Read..: శ్రీ యంత్రం ఇంట్లో పెట్టుకున్నారంటే...
రాత్రికి ఢిల్లీలో బస..
ఏపీ రాజధాని అమరావతిలో నిర్మాణ పనులను మే2న ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. అమరావతి, ఏపీకి సంబంధించిన పలు అంశాలపై సీఎం చంద్రబాబు.. మోదీతో మాట్లాడనున్నారు. శుక్రవారం రాత్రికి ఢిల్లీలోనే చంద్రబాబు బస చేస్తారు. శనివారం ఉదయం సీఎం చంద్రబాబు ఢిల్లీ నుంచి బయలుదేరి విశాఖపట్టణానికి చేరుకుంటారు. అక్కడి నుంచి శ్రీకాకుళం జిల్లా పర్యటనకు వెళతారు.
అమరావతి పనుల పునఃప్రారంభానికి ప్రధాని మోదీ
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమరావతి పనుల పునఃప్రారంభానికి మే 2న రానున్నారు. అమరావతిలో ప్రధాని ఆవిష్కరించాల్సిన పనులు, మోదీ పర్యటన వివరాలపై సిఎం చంద్రబాబుకు మంత్రి నారాయణ, సిఆర్డీఏ కమీషనర్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. సుమారు లక్ష కోట్ల రూపాయలు పనులను ప్రధాని అమరావతిలో పట్టాలు ఎక్కించనున్నారు. వివిధ పనులకు శంఖుస్ధాపనలు చేయనున్నారు. ప్రధాని చేతులు మీదుగా అమరావతిలో ఫైలాన్ ఆవిష్కరణకు ఏర్పాట్లు చేస్తున్నారు. పైలాన్‌పై ఏపీ రాష్ట్ర చిహ్నం బంగారు వర్ణంలో ఉన్న పూర్ణకుంభంతో ఉండేలా ఏర్పాటు చేస్తున్నారు. మొత్తం ఆరుమీటర్లు ఎత్తుతో పైలాన్ ఏర్పాట్లు ఉండనున్నాయి. ఫైలాన్‌పై కార్యక్రమ, అతిథుల వివరాలు ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
రెండవ రోజు కొనసాగుతున్న AI వర్క్‌షాప్..
కేంద్రం కీలక చర్యలు.. సీమా హైదర్ పరిస్థితేంటి..
ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎంఐఎం అభ్యర్థి విజయం
For More AP News and Telugu News