CM Chandrababu: రెండవ రోజు కొనసాగుతున్న AI వర్క్‌షాప్..
ABN , Publish Date - Apr 25 , 2025 | 11:52 AM
ఏపీ ముఖ్యంత్రి అధ్యక్షతన రెండో రోజు ఏఐ వర్క్‌షాపు ఏపీ సచివాలయంలో ప్రారంభమైంది. టెక్నాలజీ వినియోగంతో రియల్ టైమ్ పాలనను ప్రజలకు అందించాలని, స్మార్ట్ పాలనకు ‘4.ఓ’లో అత్యంత ప్రాధాన్యం ఇస్తామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.

అమరావతి: వెలగపూడి సచివాలయంలో గురువారం ప్రభుత్వశాఖాధిపతుల కోసం ఏర్పాటు చేసిన రెండు రోజుల ఏఐ వర్క్‌షాపు (AI workshop)ను సీఎం చంద్రబాబు (CM Chandrababu) ప్రారంభించిన విషయం తెలిసిందే. రెందో రోజు శుక్రవారం కొనసాగుతోంది. ఈ రోజు పలు అంశాలపై చర్చలు జరగనున్నాయి. ప్రభుత్వం 20 విభాగాల నుండి AI ఛాంపియన్‌లను గుర్తించి డిజిటల్ పరివర్తన చొరవలను ఎలా ముందుకు తీసుకువెళుతుంది... 100–150 AI-ఆధారిత ప్రాజెక్టులను ప్రూఫ్స్ ఆఫ్ కాన్సెప్ట్ (PoCలు), పూర్తి స్థాయి పరిష్కారాలుగా అభివృద్ధి చేయాలి.. ఈ 20 విభాగాల ద్వారా 80 శాతం ప్రభుత్వ విధులను కవర్ చేయాలి.. వాధ్వానీ సెంటర్ ఫర్ గవర్నమెంట్ డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్ (WGDT) భాగస్వామ్యంతో దీన్ని ప్రారంభించాలి.. మార్పు తీసుకువచ్చే పాలన కోసం నిర్మాణాత్మక కార్యక్రమం ద్వారా AI ఛాంపియన్‌లు, ఉత్ప్రేరకాలను రూపొందించాలి.. తదితర అంశాలపై వర్కుషాప్‌లో చర్చలు జరిగి నిర్ణయం తీసుకోనున్నారు. ఆయా విభాగాధిపతులు ఈ వర్క్‌షాపుకు హాజరయ్యారు.
Also Read..: కేంద్రం కీలక చర్యలు.. సీమా హైదర్ పరిస్థితేంటి..
తొలిరోజు వర్క్ షాపులో...
ప్రజలకు వేగవంతమైన సేవలు అందించడానికి కృత్రిమ మేధ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్-ఏఐ)ను వినియోగించినా, పాలనలో మానవీయ కోణం అత్యంత ముఖ్యమని అధికారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. టెక్నాలజీ వినియోగంతో రియల్ టైమ్ పాలనను ప్రజలకు అందించాలని చెప్పారు. స్మార్ట్ పాలనకు ‘4.ఓ’లో అత్యంత ప్రాధాన్యం ఇస్తామని స్పష్టం చేశారు. ‘‘ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫర్ గవర్నెన్స్ డిజిటల్ ట్రాన్స్‌ఫార్మేషన్’’ అంశంపై జరిగిన వర్క్‌షాప్‌లో అధికారులకు పలు సూచనలు చేస్తూ సీఎం ప్రసంగించారు. పాలనలో ఏఐకు అధిక ప్రాధాన్యం ఇస్తూనే మానవీయ కోణంలో ప్రజలకు సేవలందిస్తామని, సంక్షేమాన్ని అమలు చేస్తామని సీఎం చెప్పారు. ఏఐ ఆధారిత స్మార్ట్ పాలనా వ్యవస్థ వల్ల రియల్ టైమ్‌లో వేగవంతమైన సేవలు అందుతాయని తెలిపారు.
ఇంటర్నెట్ కోసం ఎదురు చూసే రోజులవి..
టెక్నాలజీలో వచ్చిన మార్పులను ఈ సందర్భంగా సీఎం ప్రస్తావించారు. ఒకప్పుడు ఇంటర్నెట్ కనెక్షన్ కోసం ఎదురు చూసేవారమని, 2 ఎంబీపీఎస్ స్పీడ్‌తో ఇంటర్నెట్ సేవలు దొరకడమే గగనమయ్యేదని గత రోజులను గర్తుచేశారు. ఆ దశ నుంచి వేగవంతమైన ఇంటర్నెట్ సేవలతో కూడిన పాలన అందించే స్థాయికి ఎదిగామని చెప్పారు. ఇప్పుడు డేటా ఆధారిత పాలన అందిస్తున్నామని పేర్కొన్నారు. ముప్పయి ఏళ్ల క్రితం చేసిన ప్రయత్నంతో నేడు టెక్నాలజీలో ఏపీ కీలకంగా ముందుందని అన్నారు. ఒకప్పుడు ఇస్రో ఉపగ్రహ ప్రయోగాలను ఆశ్చర్యంగా చూశామని, ఇప్పుడు మన స్టార్ట్‌పలు రూ. 30 కోట్లతో ఉపగ్రహాలను తయారు చేస్తున్నాయని చంద్రబాబు చెప్పారు. దీంతో .. ప్రపంచం మనవైపు గర్వంగా చూస్తోందని సీఎం చంద్రబాబు చెప్పారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎంఐఎం అభ్యర్థి విజయం
అక్షయ తృతీయ రోజు బంగారం ఎందుకు కొంటారంటే..
For More AP News and Telugu News