Kadiri Woman : ఆపదలో అండగా లోకేశ్
ABN , Publish Date - Jan 07 , 2025 | 04:47 AM
గల్ఫ్‌లో ఆపదలో చిక్కుకున్న శ్రీసత్యసాయి జిల్లా కదిరికి చెందిన మహిళకు మంత్రి నారా లోకేశ్ అండగా నిలిచారు.

ఖతర్ నుంచి స్వస్థలానికి కదిరి మహిళ
అమరావతి, కదిరి, జనవరి 6(ఆంధ్రజ్యోతి): గల్ఫ్‌లో ఆపదలో చిక్కుకున్న శ్రీసత్యసాయి జిల్లా కదిరికి చెందిన మహిళకు మంత్రి నారా లోకేశ్ అండగా నిలిచారు. ఉపాధి కోసం ఖతర్ దేశానికి వెళ్లి, ఏజెంట్ చేతిలో మోసపోయిన ఆమె, లోకేశ్ చొరవతో క్షేమంగా స్వస్థలానికి చేరుకున్నారు. ఖతర్‌లో యజమాని చిత్రహింసలు పెడుతున్నాడని, కనీసం తినడానికి తిండి, తాగటానికి నీళ్లు కూడా ఇవ్వడం లేదని రసీదా అనే మహిళ ‘ఎక్స్’లో లోకేశ్‌ను మొరపెట్టుకున్నారు. దీనిపై లోకేశ్ స్పందించి తన టీమ్‌ను రంగంలోకి దింపారు. వారు రసీదాను ఖతర్ యజమాని చెర నుంచి విడిపించారు. హైదరాబాద్‌కు ఆదివారం చేసుకున్న రషీదా, అక్కడి నుంచి నేరుగా కదిరికి వచ్చారు. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్‌కు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఆమె సోమవారం సెల్ఫీ వీడియో విడుదల చేశారు.