Share News

Tragedy: ఈతకు వెళ్లి ముగ్గురు బాలురు మృతి..

ABN , Publish Date - Apr 12 , 2025 | 08:39 AM

అన్నమయ్యజిల్లాలో విషాదం నెలకొంది. మైలపల్లెరాచపల్లెకు చెందిన ఏడేళ్ల వయసుగల ముగ్గురు బాలురు ఈతకు వెళ్లి నీటికుంటలో మునిగి చనిపోయారు. సంఘటన ప్రదేశానికి చేరుకున్న పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం మృత దేహాలను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Tragedy: ఈతకు వెళ్లి ముగ్గురు బాలురు మృతి..

అన్నమయ్య జిల్లా: రైల్వేకోడూరు (Railwaykoduru) నియోజకవర్గం, చిట్వేల్ మండల పరిధిలోని మైలపల్లెరాచపల్లెలో విషాదం (Tragedy) నెలకొంది. ఈతకువెళ్లి 7 సంవత్సరాల వయస్సుగల ముగ్గురు బాలురు (Three boys) మృతి చెందారు. గ్రామంలో ఆడుకుంటూ దగ్గరలోగల స్థానిక నీటికుంటలోకి (Water Puddle) రాజుదేవా,రాజు జయ,యశ్వంత్‌లు ఈతకు వెళ్లారు. నీటికుంటలో మునిగి చనిపోయారు. పిల్లల తల్లితండ్రులు చుట్టుప్రక్కల వెతకగా నీటికుంటలో వున్నట్లు స్ధానికులు గుర్తించారు. దీంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటన ప్రదేశానికి చేరుకున్న పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం మృత దేహాలను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Also Read..: ఒంటిమిట్ట కోదండరాముని కల్యాణం..


అన్నవరం దేవస్థానంలో దొంగలు బీభత్సం

అన్నవరం దేవస్థానంలో దొంగలు బీభత్సం సృష్టించారు. దేవస్థానంలో జరుగుతున్న ఓ వివాహానికి వచ్చిన మహిళ మెడలో నుండి సుమారు 40 గ్రాముల బంగారాన్ని దొంగలు తెంపుకెళ్ళిపోయారు. బాధితురాలు తూర్పుగోదావరి జిల్లా, రంగంపేట మండలం, కోటపాడు గ్రామానికి చెందిన లక్ష్మీగా గుర్తించారు. బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన అన్నవరం పోలీసులు దర్యాప్తు చేపట్టారు.


ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య

మరోవైపు శనివారం ఇంటర్‌ పరీక్షల ఫలితాలు విడుదల కానున్నాయి. ఈ పరీక్షల్లో ఫెయిల్‌ అవుతానని భావించి భయపడిన ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఘటన బండి ఆత్మకూరు మండలంలోని ఏ.కోడూరులో చోటు చేసుకుంది. ఏ.కోడూరు గ్రామానికి చెందిన వెంకట సుబ్బారెడ్డి కుమారుడు వెంకట సుదీశ్వరరెడ్డి (16) నంద్యాలలోని ఓ ప్రైవేట్‌ కళాశాలలో ఇంటర్‌ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. ఇటీవలే పరీక్షలు పూర్తి చేసుకున్న విద్యార్థి కొంతకాలంగా ముభావంగా ఉండేవాడు. ఈ క్రమంలో శనివారం ఫలితాలు విడుదల అవుతాయని తెలుసుకున్న యువకుడు ఇంట్లో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఫెయిల్‌ అయితే ఇంటా, బయటా అవమాన పాలవుతానని భావించిన సుదీశ్వర రెడ్డి ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్‌ఐ జగన్మోహన్‌ తెలిపారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నంద్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించినట్లు ఎస్‌ఐ తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి..

శోభాయమానంగా హనుమాన్ జయంతి వేడుకలు

రైల్వేలో 9,970 అసిస్టెంట్‌ లోకో పైలెట్‌ పోస్టులు

For More AP News and Telugu News

Updated Date - Apr 12 , 2025 | 08:39 AM