Share News

TDP Mahanadu 2025: టీడీపీ జెండా.. తెలుగు జాతికి అండ: అచ్చెన్నాయుడు

ABN , Publish Date - May 27 , 2025 | 12:53 PM

TDP Mahanadu 2025: పార్టీ కార్యకర్తలకు ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్ ఎప్పుడూ అండగా ఉంటారని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. వైసీపీ భూస్థాపితం అయిపోయిన పార్టీ అంటూ వ్యాఖ్యలు చేశారు. వైసీపీకి రాజకీయ భవిష్యత్తు లేదన్నారు.

TDP Mahanadu 2025: టీడీపీ జెండా.. తెలుగు జాతికి అండ: అచ్చెన్నాయుడు
TDP Mahanadu 2025

అమరావతి, మే 27: తెలుగుదేశం జెండా.. తెలుగు జాతికి అండ అని మంత్రి అచ్చెన్నాయుడు (Minister Atchannaidu) అన్నారు. కడపలో జరుగుతున్న టీడీపీ మహానాడు (TDP Mahanadu 2025) వేదికపై మంత్రి మాట్లాడుతూ.. తెలుగు ప్రజల కోసం, తెలుగు రాష్ట్రాల ప్రగతి కోసం టీడీపీ కృషి చేస్తుందన్నారు. పౌరుషాల గడ్డ కడపలో పసుపు జెండా సత్తా చూపించేందుకు తెలుగు దండు కదం తొక్కిందని తెలిపారు. తెలుగుదేశం పార్టీ చారిత్రాత్మక మహానాడు ఈసారి కడపలో ఘనంగా జరుగుతోందన్నారు. తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు నేత నారా లోకేష్ (Minister Nara Lokesh) అని వెల్లడించారు.


mahanadu-9.jpg

పార్టీ కార్యకర్తలకు ముఖ్యమంత్రి చంద్రబాబు (CM Chandrababu), మంత్రి లోకేష్ ఎప్పుడూ అండగా ఉంటారన్నారు. వైసీపీ భూస్థాపితం అయిపోయిన పార్టీ అంటూ వ్యాఖ్యలు చేశారు. వైసీపీకి రాజకీయ భవిష్యత్తు లేదన్నారు. మద్యం, ఇసుక, మైనింగ్ కుంభకోణాలతో జగన్ అండ్ కో టీమ్ ప్రజా సంపద దోచుకుందని ఆరోపించారు. వస్తున్నా మీ కోసం అని నాడు చంద్రబాబు భరోసా ఇచ్చారని.. యువగళం పేరుతో తెలుగు ప్రజలకు నారా లోకేష్ అండగా నిలిచారని మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.


అలుపెరగని శ్రామికుడు సీఎం చంద్రబాబు : పల్లా

mahanadu--palla-srinivas.jpg

అలుపెరగని శ్రామికుడు సీఎం చంద్రబాబు అని ఏపీ టీడీపీ అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ (AP TDP Chief Palla Srinivas అన్నారు. ఎన్ని ఒడిదొడుకులు వచ్చినా నిలబడి పోరాడారని తెలిపారు. పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా ఉంటే ఉన్నతస్థాయికి వెళ్లొచ్చని చెప్పారు. కార్యకర్తలకు పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందని స్పష్టం చేశారు. యువగళం ద్వారా పార్టీకి లోకేష్‌ కొత్త శక్తి ఇచ్చారన్నారు. చంద్రబాబు, లోకేష్‌ను చూసి క్రమశిక్షణ నేర్చుకోవాలని పల్లా శ్రీనివాస్ వెల్లడించారు.


ఇవి కూడా చదవండి

కన్నప్పకు బిగ్‌ షాక్.. ఏం జరిగిందంటే

పసుపు చొక్కాతో సీఎం చంద్రబాబు గ్రాండ్ ఎంట్రీ

Read Latest AP News And Telugu News

Updated Date - May 27 , 2025 | 01:53 PM