Crime News: జమ్మలమడుగు శివారెడ్డి కాలనీలో దారుణం
ABN , Publish Date - May 26 , 2025 | 08:38 AM
Crime News: కడప జిల్లా జమ్మలమడుగులోని శివారెడ్డి కాలనీలో దారుణం జరిగింది. ఇద్దరు బాలికలపై యువకుడు అఘాయిత్యానికి యత్నించాడు. అది గమనించిన స్థానికులు యువకుడిని పట్టుకుని దేహ శుద్ధి చేసి.. పోలీసులకు అప్పగించారు.

కడప జిల్లా: ప్రభుత్వం, పోలీసులు అత్యాచార ఘటనలపై ఎన్ని చట్టాలు తీసుకువచ్చి చర్యలు తీసుకుంటున్నా.. నేరాలు మాత్రం ఆగడం లేదు. దేశవ్యాప్తంగా తరచూ ఏదో ఓ మూలన మహిళలపై అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా కడప జిల్లా (Kadapa District), జమ్మలమడుగు (Jammalamadugu) శివారెడ్డి కాలనీలో దారుణం జరిగింది. ఆదివారం రాత్రి 8 గంటల సమయంలో ఏడేళ్ల బాలికలపై ఓ కామాంధుడు అఘాయిత్యానికి యత్నించాడు. ఇద్దరు పిల్లలపై(Two Minor Girls) అత్యాచారం (sexual assault) చేయబోయాడు. అయితే సకాలంలో గుర్తించిన కాలనీ వాసులు యువకుడిని పట్టుకున్నారు. ఆ కామాంధుడికి దేహశుద్ది చేసి జమ్మలమడుగు పోలీసులకు అప్పగించారు. అదుపులోకి తీసుకున్న పోలీసులు.. యువకుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
కాగా, మూడు రోజుల క్రితం కడప జిల్లా ప్రొద్దుటూరు అమృతనగర్‌కు చెందిన దంపతులు.. తమ మూడేళ్ల కుమార్తెను వెంటబెట్టుకొని మైలవరం మండలం కంబాలదిన్నెకు బంధువుల పెళ్లికి వెళ్లారు. అక్కడ పెళ్లి మండపం బయట బాలిక ఆడుకుంటోంది. అదే సమయంలో ఓ వ్యక్తి అరటి పండు ఇస్తానని ఆశ చూపించి.. చిన్నారిని ముళ్ల పొదల్లోకి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. ఈ విషయం బయటపడుతుందని భయపడి బాలికను దారుణంగా హత్య చేశాడు.
Also Read: మిస్ ఇంగ్లండ్ వ్యాఖ్యలపై సర్కార్ సీరియస్
అయితే తమ కుమార్తె కనిపించకపోవడంతో బాలిక తల్లిదండ్రులు ఆందోళన చెందారు. సమీపంలో గాలించారు. ఈ క్రమంలో ముళ్ల పొదల్లో బాలిక మృతదేహం కనిపించింది. కూతురు మృతదేహాన్ని చూసి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. బంధువులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటన ప్రదేశానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
కాకాణిని నెల్లూరుకు తీసుకువచ్చిన పోలీసులు
For More AP News and Telugu News