Share News

Case on Posani Murali Krishna: పోసానిపై కేసు.. రాజంపేటకు నరసారావుపేట పోలీసులు

ABN , Publish Date - Mar 03 , 2025 | 10:07 AM

Case on Posani Murali Krishna: వరుస కేసులతో టాలీవుడ్ నటుడు పోసాని మురళీకృష్ణ ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఇప్పటికే రాజంపేట సబ్‌ జైల్లో ఉన్న పోసాని కోసం నరసరావుపేట పోలీసులు వచ్చారు.

Case on Posani Murali Krishna: పోసానిపై కేసు.. రాజంపేటకు నరసారావుపేట పోలీసులు
Posani Murali Krishan

పల్నాడు జిల్లా, మార్చి 3: సినీనటుడు పోసాని కృష్ణమురళిపై (Posani Murali Krishan) నరసారావుపేట పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు అయ్యింది. 153 ఏ 67 ఇట్ యాక్ట్ 504 సెక్షన్‌ల కింద ఆయనపై కేసు ఫైల్ అయ్యింది. ఈ క్రమంలో పీటీ వారెంట్‌‌తో రాజంపేట సబ్‌ జైలుకు చేరుకున్నారు నరసరావుపేట పోలీసులు. రాజంపేట సబ్‌జైల్లో వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం పోసానిని అదుపులోకి తీసుకున్నారు. రాజంపేట సబ్ జైల్లో గత నాలుగు రోజులుగా పోసాని రిమాండ్ ఖైదీగా ఉన్న విషయం తెలిసిందే. నరసారావుపేట టూ టౌన్ సీఐ హేమారావు ఆధ్వర్యంలో నరసరావుపేటకు పోసానిని తరలించారు.


కాగా.. పోసాని కృష్ణ మురళిపై రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 15కు పైగా కేసులు నమోదు అయినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఒక్కొక్కరుగా పోసానిని అదుపులోకి తీసుకునేందుకు రాజంపేట సబ్‌జైలుకు దారిపట్టారు. ఇందులో భాగంగా రాజంపేట సబ్‌జైలులో ఉన్న పోసాని కోసం పీటీ వారెంట్‌తో ఈరోజు (సోమవారం) నరసారావుపేట పోలీసులు వచ్చారు. డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసినందున గతంలో పోసానిపై నరసరావుపేటలో కేసు నమోదు అయ్యింది. దీంతో నరసారావుపేట పోలీసులు రాజంపేట సబ్‌జైలుకు చేరుకుని ఆయనను అదుపులోకి తీసుకుని నరసారవుపేటకు తరలించారు. కోర్టులో హాజరుపరిచిన అనంతరం న్యాయస్థానం నిర్ణయం మేరకు నరసారావుపేట సబ్ జైలులో ఉంచుతారా లేక రాజంపేటకు తరలిస్తారా అనేది తెలియాల్సి ఉంది.

MLC Elections Vote Counting : రసవత్తరంగా ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్‌.. ఫలితాలు ఎప్పుడంటే


అయితే గత ప్రభుత్వ పెద్ద ఆదేశాలతో చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ సహా ప్రతిపక్షంలో ఉన్న వారిపై అనుచిత, అసభ్యకర వ్యాఖ్యలు చేసిన వ్యవహారంలో గత వారం పోసాని కృష్ణ మురళిని హైదరాబాద్‌లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తన వ్యాఖ్యల ద్వారా చిత్రపరిశ్రమలో విభేదాలు సృష్టించారంటూ ఆయనపై జనసేన నేత జోగినేని మణి ఇచ్చిన ఫిర్యాదుపై ఓబులవారిపల్లె పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. దీంతో పోసానిని హైదరాబాద్‌లో అరెస్ట్ చేసిన పోలీసులు.. రాజంపేట కోర్టులో హాజరుపర్చారు. కోర్టు ఆదేశాల మేరకు రాజంపేట సెంట్రల్ జైలుకు తరలించారు పోలీసులు.


అనారోగ్యం కారణంగా

మరోవైపు గత శనివారం అనారోగ్యం కారణంగా పోసానిని రాజంపేట సబ్ జైలు నుంచి ప్రభుత్వాస్పత్రికి పోలీసులు తరలించారు. గుండెనొప్పి వచ్చినట్లు జైలు అధికారులకు పోసాని చెప్పడంతో జైలు అధికారులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఆపై మెరుగైన చికిత్స నిమిత్తం కడప రిమ్స్‌కు తరలించారు. అయితే గుండె నొప్పి అంతా అబద్ధమని తేలింది. ఆయన పూర్తి ఆరోగ్యంగా ఉన్నారని వైద్యులు చెప్పడంతో తిరిగి ఆయనను రాజంపేట సబ్‌ జైలుకు పోలీసులు తరలించారు.


ఇవి కూడా చదవండి...

AP News: రఘురామ కస్టోడియల్ టార్చర్ కేసు.. సునీల్ కుమార్ నాయక్ విచారణ

Blue Flag certification: రుషికొండ బీచ్‌కు బ్లూ ఫ్లాగ్‌ గుర్తింపు రద్దు!

Read Latest AP News And Telugu News

Updated Date - Mar 03 , 2025 | 11:08 AM