Share News

అడ్డగోలు భూపందేరాలు చేసింది జగనే: అశోక్‌బాబు

ABN , Publish Date - Apr 30 , 2025 | 06:10 AM

జగన్ రేడిపై టీడీపీ నేత అశోక్ బాబు ఆక్షేపాలు, అక్రమ భూకేటాయింపులపై తీవ్ర ఆరోపణలు. జగన్ పత్రికలో అబద్ధ రాతలు ప్రచారం చేసి, చంద్రబాబుకు పునరావృతంగా దండం పెట్టాలని డిమాండ్ చేశారు.

అడ్డగోలు భూపందేరాలు చేసింది జగనే: అశోక్‌బాబు

క్రమ భూకేటాయింపులకు పెట్టింది పేరు జగన్‌రెడ్డి అని మాజీ ఎమ్మెల్సీ అశోక్‌బాబు విమర్శించారు. ఉర్సాకు భూకేటాయింపులపై జగన్‌ పత్రిక రాతలు అబద్ధాలని తేలితే వారి ముక్కు నేలకు రాయాలని, జగన్‌ పత్రిక కార్యాలయంలో చంద్రబాబు ఫొటో పెట్టుకుని పాలాభిషేకం చేసి, ఆయన ఫొటోకు దండం పెట్టాలని డిమాండ్‌ చేశారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం అశోక్‌బాబు విలేకరులతో మాట్లాడారు. ఉర్సాకు 99 పైసలకే భూకేటాయింపు చేశారంటూ జగన్‌ తన సొంత పత్రికలో తప్పుడు రాతలు రాయిస్తున్నారని ధ్వజమెత్తారు. అబద్ధాలు ప్రచారం చేస్తే క్రిమినల్‌ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జగన్‌ హయాంలోనే అడ్డగోలుగా భూపందేరాలు చేశారని మండిపడ్డారు.

Updated Date - Apr 30 , 2025 | 06:12 AM