తిరుమల వేదికగా రాజకీయాలు జగన్‌కు కొత్తేమీ కాదు: రమేశ్ నాయుడు
ABN , Publish Date - Apr 19 , 2025 | 04:40 AM
బీజేపీ రాష్ట్ర కార్యదర్శి రమేశ్ నాయుడు, తిరుమలలో జagan కుటుంబం రాజకీయాలు చేస్తున్నాయని విమర్శించారు. ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు నిర్వహించకపోవడం, రాజకీయ ప్రయోజనాల కోసం కార్యక్రమాలు పక్కదారి పట్టించడాన్ని తప్పుపట్టారు

న్యూఢిల్లీ, ఏప్రిల్ 18(ఆంధ్రజ్యోతి): ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలను సీఎం చంద్రబాబు నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహించిందని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి రమేశ్ నాయుడు అన్నారు. సీఎంగా ఉన్న రోజుల్లో ఏనాడూ జగన్ సతీసమేతంగా పట్టువస్త్రాలు ఒంటిమిట్టకు తీసుకురాలేదని విమర్శించారు. శుక్రవారం, ఏపీ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘జగన్ ఆయన సొంత జిల్లాలో ఏటా జరిగే ఒంటిమిట్ట, అన్నమయ్య ఉత్సవాలను ఏరోజు ఘనంగా నిర్వహించలేదు. ఒంటిమిట్ట ఉత్సవాలను పక్కదారి పట్టించేందుకు వైసీపీ నేతలు రాష్ట్రంలో ఆవు కథను తీసుకొచ్చారు. తిరుమలను వేదికగా చేసుకుని రాజకీయాలు చేయడం జగన్ ఫ్యామిలీకి కొత్తకాదు’ అని రమేశ్ నాయుడు విమర్శించారు.